కీచక టీచర్‌

Teacher Abuses Students In Chittoor Beaten And Arrested - Sakshi

మూడేళ్లుగా చిన్నారులపై లైంగిక దాడులు

విషయం తెలుసుకుని టీచర్‌ను చితకబాదిన గ్రామస్తులు చిత్తూరు జిల్లాలో ఘటన

సాక్షి, గుర్రంకొండ(పీలేరు): చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి.. ఆ వృత్తికే కళంకం తెచ్చేలా వ్యవహరించాడు ఓ నీచుడు. ముక్కుపచ్చలారని చిన్నారులపై మూడేళ్లుగా లైంగిక దాడులు సాగించాడు. చిన్నారులను పాఠశాల బాత్‌రూంలోకి తీసుకెళ్లి వారిపై లైంగిక దాడికి పాల్పడేవాడు. సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చిన్నారులకు చూపించి పైశాచిక ఆనందం పొందేవాడు. ఎట్టకేలకు విషయం తెలుసుకున్న గ్రామంలోని మహిళలు తమ పిల్లలపై జరుగుతున్న అకృత్యాన్ని భరించలేక ఆ ఉపాధ్యాయుడిని చితకబాదారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పీలేరు మండలంలోని భూమక్కవారిపల్లెలో శుక్రవారం జరిగింది.గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో కె. ప్రతాప్‌కుమార్‌ (35) అనే ఉపా«ధ్యాయుడు మూడేళ్లుగా పనిచేస్తున్నాడు.

పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు 10 మంది విద్యార్థులుండగా వీరిలో ఏడుగురు ఆడపిల్లలు. ప్రతాప్‌కుమార్‌ మొదటి భార్య అతని నుంచి విడాకులు తీసుకోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆమె అతని శాడిజాన్ని భరించలేకే విడాకులు తీసుకున్నట్లు తెలిసింది. కాగా మూడో తరగతికి చెందిన ఓ విద్యార్థిని గురువారం నీరసంగా ఉండడాన్ని గమనించిన తండ్రి ఆరాతీయడంతో విషయం బయటపడింది. పాఠశాలలోని  మిగతా పిల్లలను విచారించగా ఉపాధ్యాయడి లైంగిక వేధింపులను వారు ఏకరువు పెట్టారు.

శుక్రవారం ఉదయం పాఠశాల ప్రారంభం కాగానే పెద్ద ఎత్తున గ్రామస్తులు, మహిళలు అక్కడికి చేరుకుని ఉపాధ్యాయుడ్ని నిలదీశారు. అతను నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో ఆగ్రహించిన మహిళలు చెప్పులతో చితకబాదారు. ఉపాధ్యాయుడు తప్పించుకొని పొలాల వెంబడి పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంబడించి పొలాల్లోనే మరోసారి చితకబాది పాఠశాలకు తీసుకొచ్చారు. పాఠశాల గదిలో బంధించి ఎంఈవో సురేంద్రబాబుకు, ఎస్‌ఐ నరేష్‌కు సమచారం అందించారు. వారు చేరుకొని సంఘటనపై విచారణ జరిపారు. మర్రిపాడు క్లస్టర్‌ హెడ్మాస్టర్‌ మాధవి చిన్నారులను విచారించగా వారు తమపై జరిగిన లైంగిక దాడులను వివరించారు. గ్రామానికి చెందిన కొందరు యువకుల్ని పాఠశాల సమయంలో  రప్పించుకొని సెల్‌ఫోన్లో క్రికెట్‌ బెట్టింగ్‌లతోపాటు బూతు సినిమాలు చూపించేవాడని కొందరు గ్రామస్తులు పేర్కొన్నారు.

వేధింపులు భరించలేక గతేడాది ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని చిన్నారులు ఫిర్యాదుచేశారు. తాజాగా రెండు రోజుల క్రితం ముగ్గురు చిన్నారుల శరీరంపై గాయాలున్నట్లు్ల  తల్లిదండ్రులు ఆవేదన చెందాడు. చిన్నారుల తల్లిదండ్రులు లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ నరేష్‌ ఉపాధ్యాయుడ్ని అరెస్ట్‌ చేశారు. విచారణ నివేదికను డీఈవోకు పంపించి ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకొంటామని ఎంఈవో సురేంద్రబాబు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top