
ప్రమాదానికి గురైన స్కూల్ బస్సు
పశ్చిమగోదావరి, దవేగి రూరల్ : ఫిట్‌నెస్ లేకపోవడంతో స్కూల్ బస్ పంట బోదెలోకి దూసుకెళ్లిన సంఘటనలో 30 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దెందులూరు మండలం పోతునూరు గ్రామ సమీపంలో విశ్వకవి స్కూల్ బస్సు స్టీరింగ్ ఊడి పోవడంతో అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. బస్సుకు ఫిట్ నెస్ లేకపోయినా దానినే పాఠశాల యాజమాన్యం తిప్పుతోందని అంటున్నారు. గతంలోను ఇదే పాఠశాలకు చెందిన బస్సు ఈ తరహా రోడ్డు ప్రమాదానికి గురైనా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.