
సైకో దాడిలో మృతి చెందిన వృద్ధుడు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలంలో మంగళవారం ఓ సైకో వీరంగం సృష్టించాడు.
సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలంలో మంగళవారం ఓ సైకో వీరంగం సృష్టించాడు. మండలంలోని జాకారం గ్రామంలో వృద్ధుడిపై దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. అంతే కాకుండా సమీపంలోని బాలికల వసతిగృహంపైనా దాడికి దిగాడు. ఈ దాడిలో కాపలాగా ఉన్న వాచ్‌మెన్ తీవ్రంగా గాయపడ్డాడు.
దీంతో అప్రమత్తమైన గ్రామస్తులు సైకోను బంధించి పోలీసులకు సమాచారం అందించారు. సైకోను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. మృతి చెందిన వృద్ధుడిని అబ్బాపూర్ గ్రామస్తుడు కొంగొండ నర్సయ్య(75) గా గుర్తించారు. గాయపడిన వాచ్‌మెన్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.