రెండేళ్ల బిడ్డకు విషమిచ్చి చంపిన తల్లి?

Mother Killed Two Years Girl Child in Tamil Nadu - Sakshi

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నందున హత్య చేసిందని అనుమానం

నిందితురాలి అరెస్టు

వేలూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నందుకు రెండేళ్ల చిన్నారిని హత్యచేసిందనే అనుమానంతో తల్లిని పోలీసులు అరెస్ట్‌చేసి విచారిస్తున్నారు. వానియంబాడిలో చోటుచేసుకున్న ఈ సంఘటనపై పోలీసుల కథనం ఇలా ఉంది. వేలూరు జిల్లా వానియంబాడి సమీపంలోని అగరతాండవన్‌ గ్రామానికి చెందిన సత్య(21) తిరుపత్తూరులోని ప్రవేటు నర్సింగ్‌ హోమ్‌లో నర్సుగా పనిచేస్తుంది. ఈమెకు తొట్టిగనర్‌కు చెందిన శరవణన్‌తో మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. దంపతులకు రోషన్‌ అనే రెండు సంవత్సరాల కుమారుడున్నారు. ఒక సంవత్సరం కిత్రం భార్య భర్తల మధ్య ఘర్షణ ఏర్పడడంతో సత్య తన కుమారునితో పాటు అమ్మగారింటిలో నివసిస్తోంది. శరవణన్‌ ఇతర దేశాల్లో పనికి వెళ్లాడు. ఈ నేసథ్యంలో బుధవారం మధ్యాహ్నం చిన్నారి  రోషన్‌ ఇంటిలోని మంచంపై నోటి నుంచి నురగ రావడంతో పాటు మొహంపై తల దిండు పెట్టి అదిమినట్లు ఉంది. వీటిని గమనించిన బంధువులు వెంటనే కేకలు వేశారు.

గమనించిన తల్లి సత్య చిన్నారి మృతిచెందాడని కేకలు వేసి కన్నీరు పెట్టింది. ఇదిలా ఉండగా చిన్నారి నిద్రిస్తున్న సమయంలో ముఖంపై తల దిండు పెట్టడంతోనే శ్యాస ఆడకుండా మృతి చెంది ఉంటాడని తల్లి సత్య తెలిపింది. వీటిని గమనించిన స్థానికులు చిన్నారి శ్యాస ఆడకుండా మృతి చెందలేదని ఎవరైనా హత్య చేసి ఉండవచ్చునని అనుమానించారు. వెంటనే స్థానికులు దిమ్మామ్‌ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపగా చిన్నారి మృతిలో అనుమానం ఉందని స్థానికులు తెలపడంతో మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. విచారణలో సత్యకు అదే ప్రాంతానికి చెందిన ఒక యువకుడితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నందున తల్లి సత్య చిన్నారిని తల దిండుతో ముఖంపై అదిమిపెట్టి హత్య చేసిందా లేక విషపు ఇంజెక్షన్‌ వేసి హత్య చేసిందా అనుమానంగా ఉందని స్థానికులు తెలపడంతో పోలీసులు సత్యను అరెస్ట్‌చేసి విచారిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చేంత వరకు ఏ విషయం నిర్ధారించలేమని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top