అచ్చి రాలేదని ఏడు నెలల పాపను..

Mother Kill Seven Month Old Daughter In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బిడ్డ పుట్టినప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతన్నాయని, ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని  ఏడు నెలల పాపను గొంతు పిసికి చంపేసింది ఓ కసాయి తల్లి. ఈ ఘటన ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  అదిబా ఖాన్‌కు 27 ఏళ్ల వయసు. భర్తతో కలిసి హజ్రత్‌ నగర్‌లో నివాసం ఉంటుంది. ఆమెకు 7 నెలల పాప. ఇటీవల వారి ఇంట్లో అందరికి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురైయ్యాయి.

అయితే బిడ్డ పుట్టినప్పటి నుంచే ఇంట్లో ఆర్థిక పరిస్థితుల బాగాలేవని భావించి పాపను చంపాలని పథకం పన్నింది. గత నెల 20న పాప గొంతు పిసికి చంపేసింది. అనంతరం పాపను నీళ్లు ఉన్న బకెట్లో ముంచి బయటకు తీసింది. భర్తకు అనుమానం రాకుండా వెళ్లి పాపను నీళ్ల బకెట్‌లో పడిందని ఏడుస్తూ చెప్పింది. దీంతో వారిద్దరూ కలిసి పాపను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు.

పోస్టుమార్టంతో బయటపడ్డ అసలు విషయం
మృతి చెందిన 7 నెలల పాపకు డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టు చూసి డాక్టర్లు షాకయ్యారు. బిడ్డ నీళ్లలో పడి చనిపోలేదని ఎవరో ఆమె గొంతు పిసికి చంపారని పోలీసులకు తెలిపారు. పోలీసులు పాప తల్లిదండ్రులను విచారించగా చివరకు అసలు విషయం వెల్లడించారు. దీంతో అదిబా ఖన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top