పెళ్లయిన 40 రోజులకే వంచన | man Cheated Wife And Second marriage With Minor Girl In Karnataka | Sakshi
Sakshi News home page

పెళ్లయిన 40 రోజులకే వంచన

Nov 16 2018 12:42 PM | Updated on Nov 16 2018 12:42 PM

man Cheated Wife And Second marriage With Minor Girl In Karnataka - Sakshi

కుమార్తె పావనితో అంధుడైన తండ్రి కృష్ణప్ప, అన్న రామణ్ణగౌడ, నిందితుడు శివకుమార్‌

కర్ణాటక, బళ్లారి అర్బన్‌: తన ప్రేమ వ్యవహారాన్ని చెప్పకుండా ఓ యువతి మెడలో మూడుముళ్లు  వేసిన యువకుడు 40 రోజుల తర్వాత ప్రేమికురాలితో వెళ్లిపోయాడు. దీంతో భార్య, ఆమె తండ్రి ఆందోళనకు దిగారు. ఈఘటన బుధవారం   బండిహట్టిలో  చోటు చేసుకుంది. బాధితురాలి తండ్రి మేరకు వివరాలు...ఇక్కడి రాములమ్మదేవి వీధిలో నివాసం ఉంటున్న కురుబ హనుమంతప్ప కుమారుడు శివకుమార్‌(22)కు ఈఏడాది ఏప్రిల్‌ 22న మెటికి చెందిన అంధుడు కృష్ణప్ప కుమార్తె కరిబసమ్మ అలియాస్‌ పావని (21)తో వివాహమైంది. అయితే అప్పటికే శివకుమార్‌ ఓ మైనర్‌ బాలికను ప్రేమిస్తుండేవాడు. దీంతో శివకుమార్‌ పావనిని తరచూ వేధించేవాడు.

అనుమానం వచ్చిన పావని తండ్రి వచ్చి విచారించగా శివకుమార్‌ నిజస్వరూపం బయట పడింది. దీంతో పెద్దలతో పంచాయితీ పెట్టించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈక్రమంలో 40 రోజుల తర్వాత  శివకుమార్‌ భార్యను వదలి బండిహట్టికి చెందిన మైనార్‌ బాలికతో  వెళ్లిపోయాడు. మే 31న ఆ బాలకను శివకుమార్‌ పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఈక్రమంలో అప్పటినుంచి పావని తండ్రి  శివకుమార్‌ తల్లిదండ్రులతో పంచాయితీ పెట్టించాడు. ఆరు నెలలు గడిచినా తన కుమర్తెకు న్యాయం జరగకపోవడంతో కృష్ణప్ప  మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురికి ప్రాణాపాయం ఉండటంతో ఇంటికి తీసుకెళ్లిన్నట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement