మతం ఆ ప్రేమజంటను చంపేసింది.. | Love Couple Commits Suicide in Tungabhadra Drainage Guntur | Sakshi
Sakshi News home page

డ్రెయిన్‌లో దూకి ప్రేమజంట ఆత్మహత్య

Apr 12 2019 8:31 AM | Updated on Apr 12 2019 8:31 AM

Love Couple Commits Suicide in Tungabhadra Drainage Guntur - Sakshi

తిరుపతిరెడ్డి, రిజ్వానా మృతదేహాలు

మైనర్‌ ప్రేమజంట గురువారం తుంగభద్ర డ్రెయిన్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది.

కర్లపాలెం (బాపట్ల): గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం ఏట్రవారిపాలెంలో మైనర్‌ ప్రేమజంట గురువారం తుంగభద్ర డ్రెయిన్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఏట్రవారిపాలెంకి చెందిన అక్కల స్వామిరెడ్డి కుమారుడు తిరుపతిరెడ్డి (18), అదే గ్రామానికి చెందిన షేక్‌ రెహ్మాన్‌ చిన్న కుమార్తె షేక్‌ రిజ్వానా (16) ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. రిజ్వానా ఇటీవల పదోతరగతి పరీక్షలు రాసింది. బుధవారం గ్రామం నుంచి వెళ్లిపోయిన ప్రేమికులు గురువారం గ్రామ సమీపంలోని తుంగభద్ర డ్రెయిన్‌ వద్దకు చేరుకున్నారు.

తాము ప్రేమించుకున్నామని, ఒకర్ని విడిచి ఒకరం ఉండలేమని, ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకుంటున్నామని కుటుంబీకులకు ఫోన్‌లోతెలిపారు.  కుటుంబీకులు వారున్న చోటికి వెళ్లి చూడగా తిరుపతిరెడ్డి బైక్, సెల్‌ఫోన్, రిజ్వానా చున్నీ, తుంగభద్ర కట్టపై ఉన్నాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్‌ఐ గజ ఈతగాళ్లతో డ్రెయిన్‌లో వెతికించగా మృతదేహాలు లభ్యమయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement