ఇద్దరు కొడుకులతో కలసి హోంగార్డు ఆత్మహత్య 

family  suiside in khammam - Sakshi

ఖమ్మం క్రైం: ఓ హోంగార్డు ఇద్దరు కొడుకులతో కలసి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం వెంకటగిరి గేటు ప్రాంతంలో శనివారం జరిగింది. ఏపీలోని కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన  కాశీవిశ్వనాథ్‌(38), సరిత దంపతులు కొడుకులు జయంత్‌(13), అజయ్‌(11) కలసి ఖమ్మం జిల్లా కల్లూరులో ఉంటు న్నారు.  కాశీవిశ్వనాథ్‌ గణేశ్‌ సూపర్‌ మార్కెట్‌ నిర్వహిస్తూనే భద్రాద్రి కొత్తగూడెంలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు.  ఈ క్రమంలో సంక్రాంతి పండగకు పిల్లలకు కొత్త బట్టలు కొనిస్తానని చెప్పి ఉదయాన్నే  ఖమ్మం వెళ్లాడు. పిల్లలతో కలిసి తానూ వెంకటగిరి గేటు ప్రాంతంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతికి కుటుంబ, ఆర్థికపరమైన కారణాలేమైనా ఉన్నాయా? అనేది తెలియరావడం లేదు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top