ప్రాణం తీసిన అక్రమ సంబంధం | Couple Commits Suicide In PSR Nellore District | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన అక్రమ సంబంధం

May 14 2018 12:29 PM | Updated on Nov 6 2018 8:16 PM

Couple Commits Suicide In PSR Nellore District - Sakshi

వెంకటేశ్వర్లు మృతదేహం

కోవూరు: అక్రమ సంబంధం నేపథ్యంలో ఓ యువకుడు, మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కోవూరు మండలం పాటూరుచెంచమ్మతోపు కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పాటూరు చెంచమ్మతోపుకాలనీకి చెందిన కూనమల్లి వెంకటేశ్వర్లు అవివాహితుడు. వెంకటాచలం మండలం సర్వేపల్లి ఇసుకపల్లి వద్ద పశువులకాపరిగా పనిచేస్తుండగా సుప్రజ అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. సుప్రజకు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. అక్రమ సంబంధం విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో వెంకటేశ్వర్లును కుటుంబసభ్యులు ఇసుకపల్లి నుంచి పాటూరు చెంచమ్మకాలనీకి తీసుకుచ్చారు. అనంత రం కూడా వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతూనే వచ్చింది.

ఈ నేపథ్యంలో కుటుంబ కలహాలు తారాస్థాయికి చేరుకోవడంతో ఆదివారం తెల్లవారుజామున ఇద్దరూ చెంచమ్మకాలనీ సమీపంలోని చెరుకుతోటలో పురుగుమందు తాగారు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వీరిని గుర్తించిన పొరుగు పొలం రైతులు 108కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. 108లో తీసుకెళ్లే సమయంలో పరిస్థితి విషమించి వెంకటేశ్వర్లు మృతిచెందాడు. ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న సుప్రజను నెల్లూరులోని ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న కోవూరు పోలీస్‌ స్టేషన్‌ రైటర్‌ రఘు, వేణు ఘటనా స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలు నమోదు చేసుకున్నారు. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement