ముగ్గురు ఐటీ అధికారులపై సీబీఐ కేసులు

CBI Registers Case against 3 IT officials - Sakshi

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు అభియోగం

సాక్షి, హైదరాబాద్‌ : ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ముగ్గురు ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అధికారులపై సీబీఐ ఒకేరోజు దాడులు జరిపి కేసులు నమోదు చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మగ్గురు అధికారుల్లో ఇద్దరు భార్యాభర్తలు కావడం గమనార్హం. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ విభాగంలో హైదరాబాద్‌ రేంజ్‌–1, వార్డ్‌ 3లో అధికారిగా పనిచేస్తున్న సిద్దం విజయ్‌కుమార్, ఆయన భార్య జ్యోతి కుమారి ఇంటిపై (అంబర్‌పేట్‌లో) సీబీఐ ఇన్‌స్పెక్టర్‌ రాఘవేంద్రకుమార్‌ నేతృత్వంలో మూడు రోజుల కిందట సోదాలు చేపట్టి పలు పత్రాలు స్వాధీనం చేసుకుంది.

వారు రూ. 1.4 కోట్ల విలువైన అక్రమాస్తులు కూడబెట్టినట్లు అభియోగాలు మోపింది. మరోవైపు ఆదాయపు పన్ను శాఖలోని తాడేపల్లిగూడెం ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అధికారి టి. మురళీకృష్ణరావు ఇంటిపై (నాగోల్‌లో) సీబీఐ ఇన్‌స్పెక్టర్‌ డేనియల్‌ నేతృత్వంలో అధికారులు దాడులు నిర్వహించి రూ. 73.03 లక్షల అక్రమాస్తులను గుర్తించింది. నిందితులపై పీసీ యాక్ట్‌ 1988 కింద కేసులు నమోదు చేసింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top