లైంగిక దాడి కేసులో బీజేపీ ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్‌

Brother Of Rape Accused BJP MLA Kuldeep Singh Sengar Arrested - Sakshi

సాక్షి, లక్నో : యూపీలో కలకలం రేపిన ఉనావో లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ సోదరుడు అతుల్‌ సెంగార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అత్యాచార బాధితురాలి తండ్రి పోలీస్‌ కస్టడీలో మరణించిన నేపథ్యంలో ఈ అరెస్ట్‌ చోటుచేసుకోవడం గమనార్హం. ఎంఎల్‌ఏ కుల్దీప్‌ సింగ్‌ సహా ఆయన అనుచరులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత మహిళ ఆరోపిస్తూ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ నివాసం ఎదుట ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా సామూహిక అత్యాచారం కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

సెంగార్‌ సోదరులిద్దరూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారు. అయితే ఆమె ఆరోపణలను బీజేపీ ఎంఎల్‌ఏ కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ తోసిపుచ్చారు. ఈ వ్యవహారం ప్రత్యర్ధుల కుట్రని అభివర్ణించారు. బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలో మరణించిన వెంటనే సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఈ వ్యవహారంపై ఉన్నతస్ధాయి విచారణకు ఆదేశించారు. బీజేపీ ఎంఎల్‌ఏ సెంగార్‌ను పిలిపించి ఆయనతో సీఎం మాట్లాడతారని భావిస్తున్నరు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top