
లక్ష్మి పెళ్లి ఫొటో (ఫైల్)
ఇష్టం లేని పెళ్లి చేసినందుకు మనస్తాపానికి లోనైన ఓనవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన
చాదర్‌ఘాట్: ఇష్టం లేని పెళ్లి చేసినందుకు మనస్తాపానికి లోనైన ఓనవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓల్డ్ మలక్‌పేట, సాయిబాబా నగర్‌కు చెందిన చందుకు రాంనగర్‌కు చెందిన లక్ష్మీ (22)తో నెల రోజుల క్రితం వివాహం జరిగింది. సోమవారం ఉదయం చందు బయటికి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న లక్ష్మి చున్నీతో కిటికీకి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి ఇష్టం లేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.