అమెరికాలో బందరు విద్యార్థి అనుమానాస్పద మృతి | bandharu local person dead in america Suspicious | Sakshi
Sakshi News home page

అమెరికాలో బందరు విద్యార్థి అనుమానాస్పద మృతి

Feb 1 2018 8:03 AM | Updated on Apr 4 2019 3:25 PM

bandharu local person dead in america Suspicious - Sakshi

చైతన్యకుమార్‌ (ఫైల్‌)

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఓ విద్యార్థి అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మచిలీపట్నం పురపాలక సంఘంలో ఉద్యోగిగా చేస్తున్న బొమ్మల రామ్మోహనరావు కుమారుడు చైతన్య(24) ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. ఎంఎస్‌ చేసేందుకు రెండేళ్ల కిందట అమెరికాలోని ఫ్లోరిడా వెళ్లాడు. ఎంఎస్‌ పూర్తవ్వడంతో ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. కొద్దిరోజుల కిందట తండ్రికి ఫోన్‌ చేసిన చైతన్య.. అమెరికాలో ఉండలేకపోతున్నానని, ఇంటికి వచ్చేస్తానని చెప్పగా.. రామ్మోహనరావు నచ్చజెప్పాడు. ఈ నేపథ్యంలో చైతన్య మరణించాడంటూ బుధవారం సాయంత్రం రామ్మోహనరావుకు అమెరికా నుంచి ఫోన్‌ వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement