యమహా.. సెల్యూటో బైక్

యమహా.. సెల్యూటో బైక్


* ధర రూ.52,000  మైలేజీ 78 కి.మీ.

* 125 సీసీ కేటగిరీలో తేలికైన బైక్


చెన్నై: యమహా కంపెనీ 125 సీసీ కేటగిరీలో కొత్త బైక్, సెల్యూటోను శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.52,000(ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ)గా నిర్ణయించామని యమహా మోటార్ ఇండియా సేల్స్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాయ్ కురియన్ చెప్పారు. బ్లూ కోర్ ఇంజిన్ టెక్నాలజీతో ఈ బైక్‌ను రూపాందించామని, 78 కి.మీ. మైలేజీనిస్తుందని పేర్కొన్నారు.



ఈ ఏడాది 60 వేల సెల్యూటో బైక్‌లను విక్రయించగలమన్న అంచనాలున్నాయని  వివరించారు. ఈ సెల్యూటో బైక్ 125 సీసీ కేటగిరీలో హోండా షైన్, హీరో మోటొకార్ప్ గ్లామర్, బజాజ్ డిస్కవర్ 125 ఎస్‌టీ బైక్‌లతో పోటీ పడాల్సి ఉంటుంది. 125 సీసీ కేటగిరీలో అత్యంత తేలికైన టూవీలర్ ఇదే. ఈ బైక్లో సింగిల్-సిలిండర ఎయిర్‌కూల్డ్ ఇంజిన్, 4 గేర్లు, మైలేజీ కంపెనీ పేర్కొంది. వెనకా, ముందు డ్రమ్ బ్రేక్‌లు, ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, వెనక వైపు స్విన్‌గ్రామ్ సస్పెన్షన్ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు.

 

చెన్నైలో మూడో ప్లాంట్‌తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని వల్లం వడగల్‌లో మూడో ప్లాంట్‌ను  ఏర్పాటు చేస్తున్నామని రాయ్ కురియన్ చెప్పారు. ప్రస్తుతం ట్రయల్ రన్ జరుగుతోందని, వచ్చే నెల నుంచి ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించినున్నామని పేర్కొన్నారు. ఈ ప్లాంట్‌పై దశలవారీగా రూ.1,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని తెలిపారు. ప్రస్తుతం తమ కంపెనీకి హరియాణా, ఉత్తర ప్రదేశ్‌లో ప్లాంట్లు ఉన్నాయన్నారు. ఇంతకు ముందు వరకు ఏడాదికి 5.5 లక్షల టూవీలర్లను విక్రయించేవాళ్లమని, దీన్ని  ఈ ఏడాది 8 లక్షలు, 2018 నాటికి 17 లక్షలకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top