స్మార్ట్‌దేశ్‌ కా స్మార్ట్‌ఫోన్‌.. కమింగ్‌ సూన్‌

Xiaomi Redmi 7A budget smartphone to launch in India on July 4 - Sakshi

చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి మరో  బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌తో భారతీయ వినియోగదారులను ఆకట్టుకునేందుకు   రడీ అవుతోంది.  రెడ్‌ మి సిరీస్‌లో రెడ్‌మి 7ఏ పేరుతో  ఒక స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయబోతోంది.  ఈ విషయాన్ని షావోమి ఇండియా ప్రెసిడెంట్‌  మనుకుమార్‌జైన్‌  ట్విటర్‌ద్వారా వెల్లడించారు.  జూలై 4న  స్మార్ట్‌ దేశకా స్మార్ట్‌ఫోన్‌ వస్తోందంటూ ట్వీట్‌ చేశారు. అంతేకాదు ఈ డివైస్‌లో చైనాలో అందుబాటులో లేని పీచర్‌ను జోడిస్తున్నామంటూ ఊరిస్తున్నారు.

రెడ్‌మి 6ఏ  తరువాత  ఆ పరంపరలో రెడ్‌మి7ఏ ను లాంచ్‌ చేస్తోంది. ఇప్పటికై చైనాలో తీసుకొచ్చిన ఈ  స్మార్ట్‌ఫోన్‌ ధరను ఇండియాలో రూ.6 వేల వద్ద నిర్ణయించ వచ్చని అంచనా. ఇక ఫీచర్లు ఇలా ఉండనున్నాయట.

రెడ్‌మి 7ఏ ఫీచర్లు
5.4 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే
క్వాల్కం స్నాప్‌ ​డ్రాగన్‌ 439  ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ 9 పై
3జీబీ ర్యామ్‌ 32 జీబీ స్టోరేజ్‌
13ఎంపీ రియర్‌ కెమెరా
5ఎంపీ సెల్పీ కెమెరా
4000 బ్యాటరీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top