
వీధి పోటుతో ఆటుపోట్లు
కేవలం ఇంట్లోనే కాకుండా ఇంటి బయట కూడా వాస్తు ప్రభావం ఉంటుందని వాస్తు పండితులు చెబుతుంటారు...
సాక్షి, హైదరాబాద్: కేవలం ఇంట్లోనే కాకుండా ఇంటి బయట కూడా వాస్తు ప్రభావం ఉంటుందని వాస్తు పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా ఇంటిపై వీధి పోటు ప్రభావం ఎక్కువగా ఉంటుందనేది వారి సూచన. ఇంటికి ఎదురుగా నిలువుగా ఉండే వీధి ఇంటి వరకు వచ్చి ఆగిపోయినా, లేదా అక్కడ నుంచి ఏదో వైపునకు తిరిగినా దాన్ని వీధి పోటుగా గుర్తించాలి.
- ఈశాన్య భాగంలో వీధిపోటు వల్ల ఆ గృహంలో నివసించే పురుషులకు సర్వాధికారాలు లభిస్తాయి. వీరు మంచి ఆత్మ విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఏ రంగంలో కాలుపెట్టినా పైచేయి సాధిస్తారు.
- ఈశాన్య భాగంగా వీధి ఉంటే ఆ ఇంట్లోని స్త్రీలకు మేలు. ఇంటి యజమానికి ధనాదాయం బాగుంటుంది.
- వాయవ్య భాగంలో వీధి ఉండటం వల్ల ఆ ఇంట్లో స్త్రీలు తీవ్రమైన దుష్ర్పభావానికి లోనవుతారు. అనేక సమస్యలు, చికాకులు కలుగుతాయి.
- నైరుతి భాగంలో వీధి పోటు వల్ల ఇంట్లోని వారికి శ్రమ అధికంగా ఉంటుంది. ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు.
- ఆగ్నేయ భాగంలో వీధి పోటు వల్ల మంచి ఫలితాలొస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.