టయోటా ‘ఇన్నోవా’లో కొత్త వేరియంట్‌ | Toyota Innova Crysta Touring Sport Variant Launched | Sakshi
Sakshi News home page

టయోటా ‘ఇన్నోవా’లో కొత్త వేరియంట్‌

May 5 2017 12:31 AM | Updated on Sep 5 2017 10:24 AM

టయోటా ‘ఇన్నోవా’లో కొత్త వేరియంట్‌

టయోటా ‘ఇన్నోవా’లో కొత్త వేరియంట్‌

ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌’ (టీకేఎం) తాజాగా తన ప్రముఖ మోడల్‌ ‘ఇన్నోవా’లో కొత్త స్పోర్టీ వేరియంట్‌

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌’ (టీకేఎం) తాజాగా తన ప్రముఖ మోడల్‌ ‘ఇన్నోవా’లో కొత్త స్పోర్టీ వేరియంట్‌ ‘ఇన్నోవా టూరింగ్‌ స్పోర్ట్‌’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.17.79 లక్షలు–రూ.22.15 లక్షల (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ) శ్రేణిలో ఉంది. ఈ కొత్త వేరియంట్‌లో ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌లలో పలు మార్పులు చేశామని కంపెనీ పేర్కొంది.

ఎస్‌యూవీ స్టైల్‌లో కనిపించే ఇన్నోవా ఎంయూవీ తన ప్రత్యేకతతో కస్టమర్లను కట్టిపడేస్తూ, మార్కెట్‌లో అగ్రపథంలో దూసుకెళ్తోందని టీకేఎం డైరెక్టర్, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) ఎన్‌.రాజా తెలిపారు. యువకులను, ఆధునికతను కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకొని రూపొందించిన తాజా కొత్త వేరియంట్‌తో ఇన్నోవా బ్రాండ్‌ మరింత పటిష్టంగా తయారవుతుందని ధీమా వ్యక్తంచేశారు. ‘ఇన్నోవా టూరింగ్‌ స్పోర్ట్‌’ తన విభాగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టిస్తుందన్నారు. పెట్రోల్, డీజిల్‌ వేరియంట్లలో లభ్యంకానున్న ఈ కొత్త ఇన్నోవాలో ఏడు ఎయిర్‌బ్యాగ్స్, వెహికల్‌ స్టెబిలిటీ కంట్రోల్, హిల్‌–స్టార్ట్‌ అసిస్ట్‌ కంట్రోల్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement