టీవీఎస్‌ ‘అపాచీ 160 4వీ’లో కొత్త ఎడిషన్‌

 starting price of Rs .81,490 - Sakshi

ప్రారంభ ధర రూ.81,490

న్యూఢిల్లీ: వాహన తయారీ కంపెనీ ‘టీవీఎస్‌ మోటార్‌’ తాజాగా తన ‘అపాచీ 160 4వీ’లో 2018 ఎడిషన్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.81,490 (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ). ఇది మూడు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ప్రొడక్ట్‌ పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా ఈ బైక్‌ను తీసుకువస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందులో 160 సీసీ సింగిల్‌ సిలిండర్‌ 4 స్ట్రోక్‌ 4 వాల్వ్‌ ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌ను అమర్చినట్లు పేర్కొంది. ‘టీవీఎస్‌ అపాచీ వినియోగదారులకు బాగా చేరువవుతోంది.

అపాచీ సిరీస్‌లో ఈ ఏడాది ఐదు లక్షల యూనిట్ల బైక్స్‌ను విక్రయించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం’ అని టీవీఎస్‌ మోటార్‌ ప్రెసిడెంట్, సీఈవో కె.ఎన్‌.రా«ధాకృష్ణన్‌ తెలిపారు. వచ్చే 10–15 రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ ఔట్‌లెట్స్‌లో తాజా అపాచీ వేరియంట్లు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి నెల 33,000 యూనిట్ల అపాచీ బైక్స్‌ విక్రయమౌతున్నాయని తెలిపారు. 160 సీసీ అపాచీ బేస్‌ వేరియంట్‌ ధర రూ.81,490గా, టాప్‌–ఎండ్‌ ఫ్యూయెల్‌ ఇంజెక్టెడ్‌ వేరియంట్‌ ధర రూ.89,990గా ఉందని పేర్కొన్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top