చౌక టికెట్ ధరల రేసులోకి స్పైస్‌జెట్ | SpiceJet joins low fare race; ticket prices start at Rs 1499 | Sakshi
Sakshi News home page

చౌక టికెట్ ధరల రేసులోకి స్పైస్‌జెట్

Jan 29 2015 1:35 AM | Updated on Sep 2 2017 8:25 PM

చౌక టికెట్ ధరల రేసులోకి స్పైస్‌జెట్

చౌక టికెట్ ధరల రేసులోకి స్పైస్‌జెట్

ఇతర విమాన సంస్థల మాదిరిగానే స్పైస్‌జెట్ కూడా టికెట్ ధరల్లో డిస్కౌంట్లను ప్రకటించింది.

న్యూఢిల్లీ: ఇతర విమాన సంస్థల మాదిరిగానే స్పైస్‌జెట్ కూడా టికెట్ ధరల్లో డిస్కౌంట్లను ప్రకటించింది. ప్రయాణికుల కోసం దాదాపు 5 లక్షల సీట్లను ప్రారంభ ధర రూ. 1,499కే అందుబాటులో ఉంచింది. బుధవారం నుంచి మూడు రోజుల వరకు జరిగే సూపర్ అమ్మకాల్లో ముందుగా బుకింగ్ చేసుకునే టికెట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ప్రయాణికులు ఈ టికెట్లతో ఫిబ్రవరి 15 నుంచి జూన్ 30 వరకు ప్రయాణించవచ్చని పేర్కొంది.

జనవరి-మార్చి, జూలై-సెప్టెంబర్ త్రైమాసికాల్లో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటుంది. అందుకే పలు విమాన సంస్థలు ప్రయాణికుల్ని ఆకర్షించటానికి ఆఫర్లను ప్రకటిస్తాయి. సూపర్ అమ్మకాల ద్వారా సంస్థ ఆదాయం పెరుగుతుందని స్సైస్‌జెట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కనేశ్వరన్ అవిలి చెప్పారు. ప్రయాణికులకు రైళ్లు, బస్సు ప్రయాణాలతో పోలిస్తే విమాన  ప్రయాణం ఇంకా సులభతరం చేయటం కోసమే ఇలాంటి ఆఫర్లను ప్రకటించామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement