వరుస నష్టాలకు చెక్‌ : మార్కెట్లు జంప్‌ | Sensex Jumps Over 450 Points From Day Low | Sakshi
Sakshi News home page

వరుస నష్టాలకు చెక్‌ : మార్కెట్లు జంప్‌

May 14 2019 2:36 PM | Updated on May 14 2019 2:38 PM

Sensex Jumps Over 450 Points From Day Low - Sakshi

సాక్షి, ముంబై : స్టాక్‌మార్కెట్లు అనూహ్యంగా లాభాల్లోకి మళ్లాయి. ఆరంభం నుంచి ఊగిసలాట మధ్య కొనసాగిన సూచీలు మిడ్‌ సెషన్‌లో భారీగా పుంజుకున్నాయి. ఫార్మా  కన్స్యూమర్‌ షేర్లలో భారీ కొనుగోళ్లు కనిపిస్తున్నాయి.  మానిటరీ పాలసీ విధానాలను  ఆర్‌బీఐ మరింత సరళం  చేయనుందన్న వార్త మార్కెట్లకు ఊతమిచ్చింది. దీంతో సెన్సక్స్‌ డే లో నుంచి ఏకంగా 500 పాయింట్లు ఎగిసింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 370 పాయింట్లు ఎగిసి 37460 వద్ద,  నిఫ్టీ 115 పాయింట్లు పుంజుకుని 11264 మధ్య ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.

ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, సన్‌ ఫార్మ, వేదాంతా, గెయిల్‌, రిలయన్స్‌, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు టాప్‌ విన్నర్స్‌గా ఉన్నాయి. మరోవైపు రూపాయి బలపడటంతో ఐటీ సెక్టార్‌ బలహీనంగా ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement