స్టాక్‌మార్కెట్లు బేర్‌ : 300పాయింట్లు పతనం | Sakshi
Sakshi News home page

స్టాక్‌మార్కెట్లు బేర్‌ : 300పాయింట్లు పతనం

Published Fri, Feb 15 2019 12:39 PM

Sensex down 300 points HDFC twins, TCS, Sun Pharma Drag - Sakshi

సాక్షి,ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆరంభ నష్టాలనుంచి  ఏమాత్రం కోలుకోకుండా మరింత కిందికి దిగజారాయి. ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకోవడంతో 300 పాయింట్లకుపైగా పతనమైంది. సెన్సెక్స్‌ 290పాయింట్లు క్షీణించి 35,585 వద్ద నిఫ్టీ సైతం 102 పాయింట్లు తిరోగమించి 10,644 వద్ద ట్రేడవుతోంది.  అంతర్జాతీయ  ప్రతికూల సంకేతాలకు తోడు, పుల్వామా  ఉగ్రదాడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు సెంటిమెంట్‌ దెబ్బతినడంతో  అమ్మకాలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.

దాదాపు అన్ని సెక్టార్లు నష్టపోతున్నాయి. ఫార్మా అత్యధికంగా 4.25 శాతం పతనమైంది.  ఫార్మా కౌంటర్లలో డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ ఫార్మా , గ్లెన్‌మార్క్‌, దివీస్‌ లేబ్స్‌, బయోకాన్‌, పిరమల్‌, అరబిందో, లుపిన్‌, కేడిల్లా, సిప్లా 7.5-2 శాతం మధ్య పడిపోయాయి. వీటితోపాటు నిఫ్టీ దిగ్గజాలలో టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా మోటార్స్‌, అల్ట్రాటెక్‌, యస్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, హిందాల్కో, హీరో మోటో, టాటా స్టీల్‌ టాప్‌ లూజర్స్‌గా నమోదవుతున్నాయి. మరోవైపు ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌, బీపీసీఎల్‌, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, గెయిల్‌, ఎల్‌అండ్‌టీ  లాభపడుతున్నాయి. 

అటు రూపాయి కూడా ఇదే బాటలోపయనిస్తోంది. డాలరు మారకంలో 15పైసలు నష్టంతో 71.29వద్ద కొనసాగుతోంది. 
 

Advertisement
Advertisement