వెంకాబ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మీర్జా | Sania to endorse Vencobb Chicken | Sakshi
Sakshi News home page

వెంకాబ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మీర్జా

Nov 22 2014 1:26 AM | Updated on Sep 2 2017 4:52 PM

వెంకాబ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మీర్జా

వెంకాబ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మీర్జా

వెంకాబ్ చికెన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా వ్యహరించనున్నారు.

హైదరాబాద్: వెంకాబ్ చికెన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా వ్యహరించనున్నారు. ఈ మేరకు సానియాతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెంకాబ్ చికెన్ ఒక ప్రకటనలో తెలిపింది. అత్యుత్తమ బ్రాండ్ వెంకాబ్‌తో కలిసి పనిచేయడం ఎంతో సంతోషదాయకమని,  చికెన్ అమ్మకాలను ప్రోత్సహించడానికి కృషి చేస్తానని సానియా మీర్జా వ్యాఖ్యానించారు. ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందుబాటు ధరలో అందించడానికి కృషి చేస్తున్నామని వెంకాబ్ జనరల్ మేనేజర్ ఎస్. బాలసుబ్రమణ్యన్ పేర్కొన్నారు.

 నూనె, వెన్న లేకుండా చికెన్ తినడం ఎంతో మంచిదని ఈ సందర్భంగా ఎస్. బాలసుబ్రమణ్యన్ వివరించారు. వెంకో రీసెర్చ్ అండ్ బ్రీడింగ్ ఫామ్స్ శాస్త్రవేత్తలు 17 సంవత్సరాల పాటు విస్తృతంగా పరిశోధనలు చేపట్టి వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా, సంవర్థన కార్యకలాపాలకు అనువుగా ఉండేలా వెన్‌కాబ్ 400వై బ్రీడ్‌ను రూపొందించారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement