ప్రత్యర్థులకు గుబులు : దూసుకొచ్చిన జియో మార్ట్

Reliance launches JioMart services in over 200 cities  - Sakshi

దూసుకొచ్చిన  జియోమార్ట్ 

అమెజాన్, ఫ్లిప్ కార్టుకు పోటీగా రిల‌య‌న్స్ జియోమార్ట్

200  నగరాల్లో సేవలు ప్రారంభం

సాక్షి, ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కు చెందిన ఆన్‌లైన్ రీటైల్ వెంచర్ జియో మార్ట్ ఆన్‌లైన్ గ్రాసరీ డెలీవరీ సేవలను ఇపుడు మరింత విస్తరించింది.  గత నెల  పైలట్ ప్రాజెక్టుగా  ప్రారంభించిన ఈ సేవలను తాజాగా మరిన్ని నగరాల్లో ప్రారంభించింది. కరోనా వైరస్ కట్టడికి విధించిన  లాక్ డౌన్  ఆంక్షల్లో  కొంతమేర  సడలింపుల నేపథ్యంలో జియోమార్ట్  కీలకమైన ఆన్ లైన్ గ్రాసరీ సేవల్లోకి మరింత వేగంగా దూసుకొస్తోంది. 

దేశవ్యాప్తంగా 200కి పైగా పట్టణాల్లో కిరాణా సామాగ్రిని ఇపుడు పంపిణీ చేయనుంది. ఈ మేరకు రిలయన్స్ మార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దామోదర్ మాల్ ఈ ప్రకటన  చేశారు. రాజస్థాన్‌లోని నోఖా, తెలంగాణలోని బోధన్, తమిళనాడులోని నాగర్‌కాయిల్, ఆంధ్రాలోని తాడేపల్లిగూడెం, రాయగఢ్ (ఒడిశా), బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో కంపెనీ సేవలను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ఈ  సెగ్మెంట్ లో ఉన్న ప్ర‌ముఖ ఆన్ లైన్ డెలివ‌రీ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్టుల‌కు  గట్టి పోటీ ఇవ్వనుంది. (జియోలో కేకేఆర్‌ భారీ పెట్టుబడి)

నవీ ముంబై, థానే, కళ్యాణ్ ప్రాంతాలలో తన సేవలు విజయవంతమైన ఒక నెల తరువాత, అనేక పట్టణాలు, నగరాల్లో తన కార్యకలాపాను విస్తరిస్తున్నట్టు  ప్రకటించింది జియోమార్ట్. కొత్తగా ప్రారంభించిన ఇ-కామర్స్ పోర్టల్, జియోమార్ట్.కామ్  ద్వారా కిరాణా, పండ్లు, కూరగాయలు లాంటి ఇతర రోజువారీ కొనుగోళ్లకు వినియోగదారులు లాగిన్ అవ్వవచ్చు. అయితే ప్ర‌స్తుతానికి త‌న వెబ్ సైట్ ద్వారా మాత్ర‌మే క‌స్ట‌మ‌ర్ల ఆర్డ‌ర్స్ తీసుకుంటుండ‌గా, త్వ‌ర‌లో  జియోమార్ట్ యాప్  లాంచ్ చేయనుంది. (అమెజాన్‌లో 50 వేల ఉద్యోగాలు)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top