
ప్రపంచ టాప్-10 చమురు కంపెనీల్లో రిలయన్స్
ప్రపంచంలోని టాప్-10 ఎనర్జీ కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 8వ స్థానాన్ని ఆక్రమించింది.
న్యూఢిల్లీ: ప్రపంచంలోని టాప్-10 ఎనర్జీ కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 8వ స్థానాన్ని ఆక్రమించింది. గతేడాది ఇది 14వ స్థానంలో ఉండేది. ప్లాట్స్ నిర్వహించిన ‘టాప్ 250 గ్లోబల్ ఎనర్జీ కంపెనీలు-2016’ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇండియన్ ఆయిల్ కార్ప్ 66వ స్థానం నుంచి 14 స్థానానికి ఎగబాకింది. ఇక హిందుస్తాన్ పెట్రోలియం కార్ప్ 133వ స్థానం నుంచి 48వ స్థానానికి చేరింది. ముడిచమురు ధరలు తక్కువగా ఉండటమే వీటి స్థానాల మెరుగుదలకు కారణమని ప్లాట్స్ పేర్కొంది. ఓఎన్‌జీసీ స్థానం మాత్రం 17 నుంచి 20కి పడింది. కోల్ ఇండియా 38వ స్థానంలో ఉంది. ఇక అదాని పవర్ 250వ స్థానంలో నిలిచింది.