ఆరేళ్ల విరామానికి రిలయన్స్ బ్రేక్ | Reliance buys Iranian oil after six-year hiatus | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల విరామానికి రిలయన్స్ బ్రేక్

Apr 24 2016 1:27 PM | Updated on Sep 3 2017 10:39 PM

ఆరేళ్ల విరామానికి రిలయన్స్ బ్రేక్

ఆరేళ్ల విరామానికి రిలయన్స్ బ్రేక్

న్యూఢిల్లీ : ఆరేళ్ల విరామ అనంతరం రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ ను కొనుగోలు చేసేందుకు సిద్దమైంది.

న్యూఢిల్లీ: ఆరేళ్ల విరామం అనంతరం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. చాలా కాలంపాటు ఆంక్షలు కొనసాగించిన తర్వాత మళ్లీ ఆ దేశంతో  సంబంధాలను పునరుద్ధరించుకుంటామని రిలయన్స్ తెలిపింది. 2015-16 రాబడులు గురించి రిపోర్టు చేసిన అనంతరం ఇన్వెస్టర్ల ప్రెజెంటేషన్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. న్యూక్లియర్ ప్రొగ్రామ్ పై అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడులకు ఇరాన్ తలవంచకపోవడంతో, 2009 జనవరి న ఇరాన్ కు గ్యాస్ ను, పెట్రోల్ ను ఎగుమతి చేయడం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆపివేసింది. 2010 ఫిబ్రవరి నుంచి క్రూడ్ ఆయిల్ ను కూడా ఇరాన్ నుంచి కొనడాన్ని రిలయన్స్ తిరస్కరించింది.

అనంతరం అమెరికాలో షేల్ గ్యాస్ ప్రాజెక్టులలో గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. అంతేకాక అమెరికాకు పెద్ద ఇంధన సరఫరాదారుగా రిలయన్స్ మెలిగింది. ఇరాన్ తో పెట్టుకున్న ఆంక్షలు ఈ ఏడాది జనవరితో ముగియడంతో, ఆ దేశంతో మళ్లీ రిలయన్స్ సంస్థ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ విషయంపై ఇరాన్ తో సంప్రదింపులు కూడా జరిపామని రెండు ఒప్పందాల సీఎఫ్ఓ వి. విక్రాంత్ ముంబాయిలో వెల్లడించారు. ఆంక్షలు విధించుకోకముందు ఇరాన్ తో రిలయన్స్ కు మంచి సంబంధాలు ఉండేవని తెలిపారు.

మంగళూరు రిపైనరీ, పెట్రో కెమికల్స్, ఎస్సార్ ఆయిల్ లిమిటెడ్ ఇరానియన్ ఆయిల్ ను కొనడంలో ముందు ఉన్నాయి. ఏడాదిలో 10 మిలియన్ టన్నుల ఆయిల్ ను ఈ సంస్థలే దిగుమతి చేసుకుంటున్నాయి. అంతేకాక, ఈ ఏడాది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇరాన్ నుంచి రెండింతలు ఆయిల్ ను దిగుమతి చేసుకుంది. హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఆ దేశం నుంచి క్రూడ్ ఆయిల్ ను దిగుమతి చేసుకోవడం చాలా తక్కువ. పశ్చిమ దేశాలతో ఇరాన్ న్యూక్లియర్ ప్రొగ్రామ్ పై కోత విధించిన తర్వాత, రిలయన్స్ సంస్థ మళ్లీ పెట్రోల్, డీజిల్ ను ఆ దేశానికి ఎగుమతి చేయడానికి, క్రూడ్ ఆయిల్ నూ కొనుక్కునేందుకు సిద్దమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement