అద్భుతమైన వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్

OnePlus 8 series with first quad camera setup launched - Sakshi

సాక్షి,  న్యూఢిల్లీ: వన్‌ప్లస్  కొత్త  స్మార్ట్ ఫోన్లను  లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌  ఆధారంగా  వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది.  ఆక్సిజన్ ఓఎస్‌కు సున్నితంగా పనిచేయడానికి 280 కొత్త ఆప్టిమైజేషన్లను జోడించినట్లు కంపెనీ పేర్కొంది. కొత్త ఆక్సిజన్ ఓఎస్ ఫీచర్లు స్మూత్ బాటిల్ 2.0, న్యూ డార్క్ థీమ్, డైనమిక్ వాల్‌ పేపర్స్, లైవ్ క్యాప్షన్, అమెజాన్ అలెక్సా స్మార్ట్ అసిస్టెంట్‌, అలెక్సా హ్యాండ్స్-ఫ్రీ, యాప్ గ్యాలరీ ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి ఫీచర్లను అధునాతనంగా అందించినట్టు కంపెనీ వెల్లడించింది. 5జీ సపోర్ట్ ఫీచర్ అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ను మంగళవారం రాత్రి ఆన్ లైన్ ద్వారా విడుదల చేసింది. భారతీయ మార్కెట్ల ధరలపై స్పష్టంగా ప్రస్తావించకపోయినప్పటికీ అందుబాటులో ధరల్లోనే వుంటాయంటూ వన్‌ప్లస్ ట్వీట్  చేసింది. 

వన్‌ప్లస్ 8 ఫీచర్లు
6.55 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్ ప్లే,
1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్
ఆండాయిడ్ 10
48+2మాక్రో లెన్స్+16 ఎంపీ టెర్టియరీ సెన్సార్
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
4300 ఎంఏహెచ్. బ్యాటరీ సామర్థ్యం

వన్‌ప్లస్ 8 ప్రో 
6.78 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ 10, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్
1440x3168 పిక్సెల్స్ రిజల్యూషన్
8జీబీర్యామ్,128 జీబీ స్టోరేజ్
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
48+8+48+5 ఎంపీ క్వాడ్ రియర్ కెమరా
4510ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యం

భారత మార్కెట్లో వీటి ధరలపై అంచనా
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.53,200
12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.60,800 

వన్‌ప్లస్ 8 ప్రో  ధరలు
ప్రారంభ ధర రూ. 55,000 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top