సమ్మె బాటలో ఓలా, ఉబెర్‌ డ్రైవర్లు

Ola, Uber drivers on strike today  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో నేడు (సోమవారం, 23న)  ఉబర్, ఓలా క్యాబ్‌ సర్వీసులను నిలిపివేశారు.  ఫైనాన్సర్ల వేధింపులు, క్యాబ్‌ డ్రైవర్‌ల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో   ఈ బంద్‌ను పాటిస్తున్నట్టు తెలంగాణ క్యాబ్‌ డ్రైవర్స్‌ అండ్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివ తెలిపారు.  అనారోగ్యకరమైన  పోటీతో  డ్రైవర్లు నష్టపోతున్నారని చెప్పారు.  ఈ సమ్మెతో నగరంలో క్యాబ్‌ సర్వీసులకు తీవ్ర అంతరాయం కలగనుంది.

క్యాబ్‌ డ్రైవర్లు తమ సమస్యలపై పలుమార్లు తాము ఆందోళన చేపట్టినా.. ప్రభుత్వం స్పందించడంలేదని  అసోసియేషన్‌ అధ్యక్షుడు విమర్శించారు.  తమ డిమాండ్లను నెరవేర్చకపోతే తమ ఆందోళనను  మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. లక్షన్నర కార్లు ఈ రెండు సంస్థల్లో తిరుగుతున్నాయని, రూ.లక్షలు అప్పులు తెచ్చి కార్లు కొనుక్కున్న ఎంతోమందికి కనీస ఉపాధి లభించడం లేదన్నారు. ఫైనాన్సర్ల వద్ద వాయిదాలు చెల్లించలేక, వేధింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేద వ్యక్తం చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top