రూ. 300 కోట్ల డైమండ్‌ నెక్లెస్‌ గిఫ్ట్‌

Nita Ambani Gave Her Daughter-In-Law, Shloka Mehta A Wedding Gift Worth Rs 300 Crore - Sakshi

ఆకాశమంత పందిరిలా  సాగే  కార్పొరేట్‌ వెడ్డింగ్‌లో ప్రతీ అంశమూ  ప్రత్యేకంగానే నిలుస్తుంది.  వెడ్డింగ్‌ కార్డులు దగ్గరినుంచి, సంగీత్‌, బారాత్‌లంటూ పెళ్లి దాకా సాగా హడావిడి ఇంతా అంతా కాదు.  ఈనేపథ్యంలోనే  రిలయన్స్‌ కుటుంబం కొత్త కోడలికి ఇచ్చిన భారీ కానుక ఇపుడు హాట్‌ టాపిక్‌గా నిలిచింది. అక్షరాలా  300 కోట్ల రూపాయల విలువైన డైమండ్‌ నెక్లెస్‌ను రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ భార్య నీతా అంబానీ  తన కొత్త కోడలు శ్లోకా మెహతాకు కానుకగా  ఇచ్చారు.  

నిజానికి తమ కుటుంబ వారసత్వంగా వస్తున్న బంగారం హారాన్ని కోడలికి పెళ్లిలో కానుకగా ఇవ్వాలనుకున్నారట మొదట నీతా అంబానీ. కానీ  సమయానికి తగ్గట్టుగా మనసు మార్చుకున్న నీతా దానికి భిన్నంగా ప్రపంచంలోనే అత్యంత విలువైన నగను ఎంపిక చేయాలనుకున్నారట.  అందుకే అత్యంత విలువైన వజ్రాలు, ఇతర విలువైన రాళ్లు పొదిగిన నెక్లెస్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేయించి మరీ గిఫ్ట్‌గా అందించారట. తనెంతో ఇష్టంగా చేయించిన వజ్రాల హారాన్ని  శ్లోకా మెడలో అలంకరించి నీతా ముచ్చట పడిపోగా, అటు అత్తగారిచ్చిన ప్రేమ పూర్వక కానుకతో శ్లోకా కూడా అంతే మురిసిపోయారట..

వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీల కుమారుడు ఆకాష్‌ అంబానీకి, అతని చిన్నప్పటి స్నేహితురాలు శ్లోకా మెహతాకు మార్చి తొమ్మిదిన ముంబైలో అత్యంత వైభవంగా వివాహం జరిగిన విషయం తెలిసిందే.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top