ఆపిల్ ఉత్పత్తుల లీకు వీరులు వారే! | Most Apple 'leaks' coming directly from its employees: Report | Sakshi
Sakshi News home page

ఆపిల్ ఉత్పత్తుల లీకు వీరులు వారే!

Jun 21 2017 6:16 PM | Updated on Aug 20 2018 2:55 PM

ఆపిల్ ఉత్పత్తుల లీకు వీరులు వారే! - Sakshi

ఆపిల్ ఉత్పత్తుల లీకు వీరులు వారే!

టెక్నాలజీ సంస్థల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆపిల్ నుంచి ఏదైనా కొత్త ప్రొడక్ట్ వస్తుందన్నా? లేదా రాబోతుందన్నా? టెక్ వర్గాలు, అభిమానులు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు.

శాన్ ఫ్రాన్సిస్కో : టెక్నాలజీ సంస్థల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆపిల్ నుంచి ఏదైనా కొత్త ప్రొడక్ట్ వస్తుందన్నా? లేదా రాబోతుందన్నా? టెక్ వర్గాలు, అభిమానులు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. అందుకేనేమో కంపెనీ అధికారికంగా చెప్పకముందే కొత్త ప్రొడక్ట్ ల గురించి సమాచారమంతా జర్నలిస్టుల, బ్లాగర్ల చేతిలోకి వెళ్లిపోతుంటుంది. కానీ ఈ లీక్స్ చేసేది ఎవరూ? కంపెనీ తన ప్రొడక్ట్ గురించి ఇసుమంతైనా సమాచారం ఇవ్వకుండానే వారికెళ్లా తెలిసిపోతుందంటే.. కాస్త ఆశ్చర్యమే. తాజాగా ఈ లీక్ వీరులు ఎవరన్నది ఆపిల్ కనిపెట్టేసింది. కంపెనీ ఉద్యోగుల నుంచే లీక్స్ ఎక్కువగా వెళ్తున్నాయని కంపెనీ అంతర్గత బ్రీఫింగ్ లో తెలిపింది. ఈ విషయాన్ని పలు రిపోర్టులు వెల్లడించాయి.
 
ఆపిల్ లీక్స్ కూడా ఎక్కువగా చైనాలోని తయారీ సంస్థల నుంచే బయటివస్తున్నాయని తెలిసింది. ఈ లీక్స్ ను నిరోధించడానికి కంపెనీ చర్యలకు కూడా ఉపక్రమించింది.వర్కర్లు ఫ్యాక్టరీలోకి వచ్చేముందు,వెళ్లేటప్పుడు కచ్చితంగా సెర్చింగ్ ఆపరేషన్ ను కంపెనీ చేపడుతోంది. అమెరికా గూఢాచార ఏజెన్సీల మాజీ సభ్యులు ఆపిల్ లీక్స్ గురించి గతకొన్నేళ్లుగా విచారణ చేపట్టారని, ఇంటర్నల్ బ్రీఫింగ్ లో ఈ విషయాన్ని తెలిపినట్టు అవుట్ లైన్ రిపోర్టు చేసింది. చైనాలోని 40 ఫ్యాక్టరీల్లో రోజుకు 2.7 మిలియన్ల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారందరినీ కంపెనీ స్క్రీన్ చేస్తుందని అవుట్ లైన్ పేర్కొంది. 
 
ఆపిల్ బిగ్గెస్ట్ లీక్స్ ఒకటైన 2013 ఘటనలో, ఉద్యోగులు ఐఫోన్ ను అసెంబ్లింగ్ చేస్తున్నట్టు 19వేల ఎన్ క్లోజర్లను కొట్టేసి, వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్మారు. ఈ ఎన్ క్లోజర్స్ లో డివైజ్ కు చెందిన కీలక సమాచారం బయటికి పొక్కింది. స్క్రీన్ సైజ్, పోర్ట్స్, వంటి కీలక అంశాలు లీకయ్యాయి. కానీ తర్వాత తర్వాతి ఏడాదిల్లో లీక్స్ కొంత తగ్గాయి. 2014లో లీక్స్ 387కి పడిపోగా, 2016లో నాలుగు ఎన్ క్లోజర్సే బయటికి వెళ్లాయి. ప్రస్తుతం ఎక్కువ దొంగతనాలు విదేశాల్లో ఉన్న తన ఫ్యాక్టరీల్లో కంటే కాలిఫోర్నియాలోని క్యాంపస్ లలో జరుగుతున్నట్టు తేలింది. కంపెనీ తాము చేసే పనిగురించి ఇంట్లో కూడా మాట్లాడవద్దని ఉద్యోగులకు సూచిస్తోంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement