ఆరుగురు సభ్యుల్లో.. కేవలం ఒక్కరు మాత్రమే | Sakshi
Sakshi News home page

ఆరుగురు సభ్యుల్లో.. కేవలం ఒక్కరు మాత్రమే

Published Wed, Dec 6 2017 4:21 PM

Monetary Policy: only one MPC member votes for rate cut - Sakshi

ముంబై : రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా తన మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో కీలక వడ్డీరేటు రెపోను యథాతథంగా 6 శాతంగా కొనసాగిస్తున్నట్టు పేర్కొంది. ద్రవ్యోల్బణం భయాల పేరుతో రెపోరేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్టు పేర్కొంది. ఈ నిర్ణయాన్ని తీసుకునే ఆరుగురు సభ్యుల మానిటరీ కమిటీలో, ఐదుగురూ యథాతథంగా కొనసాగించడానికే అంగీకారం తెలిపారు. కానీ ఒకే ఒక్క సభ్యుడు మాత్రమే రేట్ల కోతకు ఓటు వేశారు. ఆయనే అహ్మదాబాద్‌ ఐఐఎం ప్రొఫెసర్‌ రవీంద్ర దోలకియా. ఆరుగురు సభ్యులున్న మానిటరీ పాలసీ కమిటీల్లో ఈయన ఒకరు. మెజార్టీ సభ్యుల నిర్ణయం మేరకు మానిటరీ పాలసీ ప్రకటనలో వడ్డీరేట్లపై నిర్ణయం ప్రకటిస్తారు. 

నేడు ప్రకటించిన ఈ పాలసీ ప్రకటనలో డాక్టర్‌. చేతన్‌ ఘటే, డాక్టర్‌. పామి దువా, డాక్టర్‌ వైరల్‌ వీ.ఆచార్య, మైఖెల్‌ పాత్ర, డాక్టర్‌ ఉర్జిత్‌ పటేల్‌, రవీంద్ర దోలకియా ఉన్నారు. కేవలం రవీంద్ర దోలకియా మాత్రమే 25 బేసిస్‌ పాయింట్ల వరకు రెపోను తగ్గించవచ్చని పేర్కొన్నారు. గత పాలసీలో కూడా ఆయన రేటు కోతకే మొగ్గుచూపారు. అంతేకాక 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన ఆగస్టు సమావేశంలో కూడా 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కానీ ఆర్‌బీఐ మాత్రం ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయంతో, రెపోను యథాతథంగానే ఉంచుతూ వస్తోంది. వచ్చే రెండు క్వార్టర్‌లలో ద్రవ్యోల్బణం 4.2 శాతం నుంచి 4.6 శాతానికి పెరుగుతుందని, క్రూడ్‌ ఆయిల్‌ ధరలు, కూరగాయల ధరలు 4.3 శాతం నుంచి 4.7 శాతానికి పెరుగుతాయని ఆర్‌బీఐ అంచనావేస్తోంది. 

Advertisement
Advertisement