మారుతీ సేల్స్‌13,865 యూనిట్లు..షేర్లు 3% అప్‌ | maruti suzuki may sales | Sakshi
Sakshi News home page

మారుతీ సేల్స్‌13,865 యూనిట్లు..షేర్లు 3% అప్‌

Jun 1 2020 11:17 AM | Updated on Jun 1 2020 11:25 AM

maruti suzuki may sales - Sakshi

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకి మే నెలలో 13,865 యూనిట్లను దేశీయంగా విక్రయించినట్లు ప్రకటించింది. కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా అమలుచేస్తోన్న లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో హర్యాణాలోని గురుగావ్‌,మానేసర్‌ కేంద్రాల్లో ఉత్పత్తి పునరుర్దరించింది. పునరుద్దరణ తరువాత మే నెలలో 13,865 యూనిట్ల వాహన విక్రయాలు జరిపినట్లు ఈకంపెనీ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం మే నెలలో 125,552 యూనిట్ల వాహనాలను దేశీయంగా విక్రయించినట్లు మారుతీ పేర్కొంది. 
ముంబై పోర్ట్‌ ద్వారా 4,651 యూనిట్ల వాహనాలను,  టయోటాతో కలిసి మరో 23 యూనిట్లను ఎగుమతి చేసినట్లు వివరించింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో కొన్ని షోరూంలను తెరిచామని, కంటైన్మెంట్‌ లేని జోన్లలో కూడా ఆ ప్రాంత నిబంధనలను అనుసరించి మిగతా వాటిని కూడ తెరుస్తామని ఒక ప్రకటనలో మారుతీ తెలిపింది. కాగా ప్రస్తుతం బీఎస్‌ఈలో మారుతీ సుజుకీ ఇండియా షేరు 2.7 శాతం పెరిగి రూ.5763.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement