వినియోగదారులకు ఎస్‌బీఐ బాసట

 Live your best life with Pre Approved Personal Loans says SBI - Sakshi

ఆరోగ్య, ఆర్థిక అవసరాలకు  ప్రిఅప్రూవ్డ్ లోన్‌ 

అన్నదాతలకు ఎస్‌బీఐ గోల్డ్ లోన్లు

సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు మరో వెసులుబాటును కల్పించింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తితో ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు భారీ ఊరట కల్పించనుంది. యోనో కృషి యాప్ ద్వారా వ్యవసాయదారులకు గోల్డ్ లోన్ సదుపాయాన్ని అందిస్తోంది. కరోనా వైరస్ సంక్షోభం, లాక్ డౌన్ సమయంలో   అన్ని నిబంధనలను పాటిస్తూ కూడా నిరంతరాయంగా తమ కస్టమర్లకు సేవలందిస్తున్నామని పేర్కొంది. ఈ క్రమంలో ఇప్పటికే  ఇలాంటి రుణాలను 5 లక్షలకు పైగా  చెల్లిచినట్టు తెలిపింది. 

దీంతోపాటు తన వినియోగదారులకు ప్రిఅప్రూవ్డ్ లోన్‌  సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ మేరకు ఎస్‌బీఐ తన అధికారిక ట్విటర్లో వివరాలను పోస్ట్ చేసింది. కరోనా కల్లోలంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి భారీ ఊరటనిచ్చింది.   అలాగే లాక్‌డౌన్‌  కారణంగా  ఆరోగ్యం అత్యసవర సమయంలో ఇబ్బంది పడకుండా కేవలం నాలుగు క్లిక్స్ ద్వారా రూ. 5 లక్షల వరకు ప్రిఅప్రూవ్డ్ పెర్సనల్  రుణాలను  సొంతం చేసుకోవాలంటూ ఒక వీడియోను షేర్ చేసింది.   

ఎస్‌బీఐ అందిస్తోందన్న ఈ సౌకర్యం ద్వారా  వినియోగదారులు 45 నిమిషాల్లో రుణం పొందొచ్చు. అయితే గమనించాల్సిన అవసరం ఏమిటంటే ఈ రుణాలు అందరికీ అందుబాటులో ఉండవు. కేవలం ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో వుంటుంది.  567676కు  ఎస్ఎంఎస్ పంపి రుణం వస్తుందా లేదా అని  తెలుసుకోవచ్చు. (జియో మరో భారీ డీల్ )

రుణం పొందాలంటే
పీఏపీఎల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి బ్యాంక్ అకౌంట్ చివరి నాలుగు అంకెలు ఎంటర్ చేసి  ఎస్ఎంఎస్ చేయాలి.  మన అర్హతను బట్టి  తిరిగి బ్యాంక్ నుంచి ఎస్ఎంఎస్ వస్తుంది.  అర్హత పొందిన కస్టమర్లు, ప్రిఅప్రూవ్డ్ లోన్‌పై క్లిక్ చేసి, సంబంధిత వివరాలు నమోదు చేయాలి. వివరాల పరిశీలన తరువాత లోన్ డబ్బులు బ్యాంక్ అకౌంట్‌లోకి వచ్చేస్తాయి. ఓటీపీ నిర్ధారణ ద్వారా రుణం మొత్త సంబంధిత ఖాతాలో జమ అవుతుంది.  అంతేకాదు ఈ సౌకర్యానికి ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు.  (మద్యం షేర్లకు మినహాయింపు కిక్కు)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top