ట్రంప్ ప్రభుత్వానికి భారత్ స్ట్రాంగ్ వార్నింగ్

ట్రంప్ ప్రభుత్వానికి భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ - Sakshi

న్యూఢిల్లీ : హెచ్-1బీ వీసాల్లో కఠినతరమైన నిబంధనలపై భారత్ ఆగ్రహించింది. ఈ నిబంధనలపై ట్రంప్ ప్రభుత్వంతో చర్చోపచర్చలు జరుపుతున్నా వారు తలొగ్గకపోవడంతో ఆ ప్రభుత్వానికి భారత్ గట్టి హెచ్చరికలు జారీచేసింది. అమెరికా కంపెనీలు కూడా భారత్లో వ్యాపారం చేస్తున్నాయని, ఆ విషయాన్ని అమెరికా అథారిటీలు దృష్టిలో ఉంచుకోవాలని వాణిజ్య పరిశ్రమల శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ వార్నింగ్ ఇచ్చారు.

 

''కేవలం భారత కంపెనీలు మాత్రమే అమెరికాలో లేవు. పెద్ద పెద్ద అమెరికా కంపెనీలు కూడా భారత్లో ఉన్నాయి.వారు భారీ ఎత్తున్న భారత్ మార్కెట్లో ఆదాయాలు   ఆర్జిస్తున్నారు. ఆ ఆదాయాలను అమెరికా ఆర్థికవ్యవస్థకు తీసుకెళ్తున్నారు. అమెరికా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో కేవలం భారత్ కంపెనీలే ప్రభావితం కావు. కొన్నేళ్లుగా భారత్లో వ్యాపారాలు చేస్తున్న పెద్దపెద్ద అమెరికా కంపెనీలపై కూడా ప్రభావం పడుతుంది. ఒకవేళ ఈ వీసా ఆందోళనలు ఇలానే కొనసాగిస్తే, మేము వాటిని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటాం. అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని మీరు వ్యవహరించాలి'' అని నిర్మలా సీతారామన్ అమెరికా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 

అన్యాయకరమైన ధోరణిని తాము అంగీకరించేది లేదంటూ నిర్మలా సీతారామన్ తేల్చిచెప్పారు. భారత్ ఐటీ కంపెనీలకు భారీ షాకిస్తూ.. వీసా నిబంధనలు కఠినతరంపై డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై స్పందించిన మంత్రి ట్రంప్ ప్రభుత్వంపై మండిపడ్డారు. వీసా నిబంధనల్లో మార్పులపై ఐటీ కంపెనీల ఆందోళనలను భారత్ ట్రంప్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా.. వారు తలొగ్గడం లేదు. దీంతో మంత్రి సీరియస్ అయ్యారు. ఆ దేశ కంపెనీలు కూడా భారత్ లో ఉన్నాయనే విషయాన్ని గుర్తుచేశారు.  
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top