85 యాప్‌లను తొలగించిన గూగుల్‌ | Google Removes 85 Apps Play Store Over Hidden Adware | Sakshi
Sakshi News home page

85 యాప్‌లను తొలగించిన గూగుల్‌

Aug 17 2019 3:12 PM | Updated on Aug 17 2019 3:34 PM

Google Removes 85 Apps Play Store Over Hidden Adware - Sakshi

టెక్‌ దిగ్గజం గూగుల్‌ తన ప్లేస్టోర్‌లోని 85 యాప్‌లను తొలగించింది. భద్రతా కారణాల రిత్యా వాటిని తొలగించినట్లు పేర్కొంది. యాడ్‌వేర్‌ అనే మాల్‌వేర్‌ రకం వైరస్‌ ఈ యాప్‌లలో ఉందంటూ ట్రెండ్‌ మైక్రో అనే సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ హెచ్చరించడంతో గూగుల్‌ వాటిని తొలగించింది. ఇవి అననుకూల యాడ్‌లను చూపించడమేగాక, వినియోగదారుల సమాచారాన్ని తస్కరిస్తున్నాయని గూగుల్‌ తెలిపింది.

తొలగించిన యాప్‌లలో ఎక్కువగా ఫోటోగ్రఫీ, గేమింగ్‌కు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయని, వీటిని ఇప్పటికే 8 మిలియన్ల మంది ఉపయోగిస్తున్నారని గూగుల్‌ పేర్కొంది. వీటిలో సూపర్‌సెల్ఫీ, కాస్‌ కెమెరా, వన్‌ స్ట్రోక్‌ లైన్‌ పజిల్‌ లాంటి ప్రముఖ యాప్‌లు కూడా ఉన్నాయి. ఈ యాప్‌లను ప్లేస్టోర్‌లో వివిద ప్రాంతాలనుంచి అప్‌లోడ్‌ చేసినా.. అవి అన్నీ ఒకే రీతిలో ప్రవర్తిస్తుండటంపై అనుమానం వ్యక్తం చేసింది. వాటి పనితీరు ఒకే విధంగా ఉంటూ ఆందోళన కలిగించిందని తెలిపింది.  అయితే ఈ యాడ్‌వేర్‌ పాత ఆండ్రాయడ్‌ ఫోన్‌లను ఏం చేయదని గూగుల్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement