
ఎంసీఎక్స్‌లో భగ్గుమన్న బంగారం, వెండి ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : ఈక్విటీ మార్కెట్ల పతనం, కరోనా వైరస్ ప్రభావంతో బంగారం, వెండి ధరలు మళ్లీ రికార్డు స్ధాయికి చేరువవుతున్నాయి. గత రెండు రోజులుగా పెరుగుతున్న హాట్‌మెటల్స్ సరికొత్త గరిష్టస్ధాయిలను తాకేలా దూసుకుపోతున్నాయి. ఎంసీఎక్స్‌లో గురువారం ఉదయం పదిగ్రాముల పసిడి ఏకంగా రూ 180 భారమై రూ 41,601కు దూసుకుపోయింది. మరోవైపు వెండి ధరలు సైతం మండిపోతున్నాయి.
కిలో వెండి రూ 335 పెరిగి ఏకంగా రూ 47,598కి చేరింది. గోల్డ్, సిల్వర్ ధరల పరుగు చూస్తుంటే ఈ ఏడాది చివరికి ఇవి రూ 50,000 మార్క్‌ను చేరవ కావచ్చని బులియన్ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి, మందగమనం, ఉద్రిక్తతలు అరుదైన లోహాలకు డిమాండ్ పెంచుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.