మార్కెట్లోకి ఫోర్డ్‌ ‘ఎకోస్పోర్ట్‌ 2019’ | Ford Ecosport launch Market | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి ఫోర్డ్‌ ‘ఎకోస్పోర్ట్‌ 2019’

Jun 5 2019 10:40 AM | Updated on Jun 5 2019 10:40 AM

Ford Ecosport launch Market - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘ఫోర్డ్‌ ఇండియా’ తాజాగా తన పాపులర్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ‘ఎకోస్పోర్ట్‌’లో నూతన వెర్షన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పెట్రోల్, డీజిల్‌ ఇంజిన్లతో అందుబాటులోకి వచ్చిన ఈ 2019 ఎడిషన్‌ ధరల శ్రేణి రూ.7.69 లక్షల నుంచి రూ.11.33 లక్షలుగా నిర్ణయించింది. పెట్రోల్‌ వేరియంట్‌ 1.5లీటర్ల ఇంజిన్, 1–లీటర్‌ ఎకోబోస్ట్‌ ఇంజిన్‌ ఆప్షన్లతో లభిస్తుండగా.. డీజిల్‌ వేరియంట్‌ 1.5లీటర్ల ఇంజిన్‌తో అందుబాటులోకి వచ్చింది. ‘థండర్‌ ఎడిషన్‌’ డీజిల్‌ ఇంజిన్‌ ధరల శ్రేణి రూ.10.18 లక్షల నుంచి రూ.10.68 లక్షలు. ఇక గతేడాది ఎకోస్పోర్ట్‌ వెర్షన్‌తో పోల్చితే ఈ నూతన ఎడిషన్‌ ధర రూ.57,400 వరకు తగ్గినట్లు కంపెనీ ప్రకటించింది. ట్రిమ్‌ స్థాయి ఆధారంగా రూ.8,300 నుంచి గరిష్టంగా 57,400 వరకు తగ్గినట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఫోర్డ్‌ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ మెహరోత్రా మాట్లాడుతూ.. ‘ఉత్పత్తి అభివృద్ధి పరంగా బలమైన బృందం తమ పనితీరును ప్రదర్శించడం, కొనసాగుతున్న స్థానికీకరణ కృషి ఫలితంగా ఈ నూతన వెర్షన్‌ విడుదలైంది’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement