కొత్త పాలసీలపై కాదు యాక్షన్‌ ప్లాన్‌పై దృష్టిపెట్టాలి | Focus on Action plan | Sakshi
Sakshi News home page

కొత్త పాలసీలపై కాదు యాక్షన్‌ ప్లాన్‌పై దృష్టిపెట్టాలి

May 26 2018 12:35 AM | Updated on Oct 8 2018 7:58 PM

Focus on Action plan  - Sakshi

న్యూఢిల్లీ: వాహన పరిశ్రమ కొత్త ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) పాలసీపై కాకుండా యాక్షన్‌ ప్లాన్‌పై దృష్టి కేంద్రీకరించాలని మహీంద్రా ఎలక్ట్రిక్‌ సీఈవో మహేశ్‌ బాబు సూచించారు. నీతి ఆయోగ్‌ సూచించిన నిర్దేశకాలు సరిపోతాయని పేర్కొన్నారు. సీఐఐ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘మరిన్ని విధానాలపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. పాలసీలు తీసుకురావడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని భావిస్తున్నాను.

అయితే, మనకు ఎక్కువ పాలసీలు అవసరం లేదు. నీతి ఆయోగ్‌ ఆవిష్కరించిన విధానానికి తగిన కార్యాచరణ ప్రణాళిక ఉంటే, అనుకున్నదాన్ని 2030 నాటికి సాధించొచ్చు’’ అని వివరించారు. నీతి ఆయోగ్‌ 2017 మే నెలలో పేర్కొన్న నిర్దేశకాలు సరిపోతాయని పేర్కొన్నారు. వీటి ప్రకారం వాహన పరిశ్రమ పనిని ప్రారంభిస్తే దేశం సరైన దిశలో పయనిస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన గ్రీన్‌ లైసెన్స్‌ ప్లేట్స్‌ పథకం ఎలక్ట్రిక్‌ వాహన విభాగానికి సానుకూలమని అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement