ఫేస్‌బుక్‌ ఇండియా ఎండీ పదవికి గుడ్‌బై

Facebook India MD Umang Bedi steps down - Sakshi

ఫేస్‌బుక్‌ ఇండియా సీఈవో, ఎండీ పదవికి ఉమాంగ్‌ బేడి గుడ్‌బై చెప్పారు. గతేడాది జూన్‌లో ఈ సోషల్‌ మీడియా కంపెనీకి సీఈవోగా నియమింపబడ్డ ఉమాంగ్‌ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం కంపెనీ తాత్కాలిక మేనేజింగ్‌ డైరెక్టర్‌గా సందీప్‌ భూషణ్‌ ఎంపికయ్యారు. భూషణ్‌ అంతకముందు శాంసంగ్‌ ఐటీ, మొబైల్‌ బిజినెస్‌కు మాజీ డైరెక్టర్‌. ఉమాంగ్‌ బేడీ రాజీనామాను ఫేస్‌బుక్‌ ఇండియా ధృవీకరించింది. ఉమాంగ్‌ బేడీ ఈ ఏడాది చివర్లో ఫేస్‌బుక్‌ నుంచి వెళ్లిపోతున్నారని తెలిపింది. తమతో పనిచేసినంత కాలం ఆయన బలమైన టీమ్‌ను, వ్యాపారాన్ని ఏర్పాటుచేశారని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. ఆయనకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్టు ఆకాంక్షించారు. 

అడోబ్‌ దక్షిణాసియా ప్రాంతానికి ఎండీగా ఉన్న ఉమాంగ్‌ బేడీని ఫేస్‌బుక్‌ గతేడాది తన కంపెనీలోకి చేర్చుకుంది. దేశంలోని టాప్‌ క్లయింట్లు, రీజనల్‌ ఏజెన్సీలతో వ్యూహాత్మక సంబంధాలను ఆయన ఏర్పాటుచేశారు. అడోబ్‌లో ఉన్నప్పుడు కూడా ఆయన ఇదే రకమైన పనితీరు కనబర్చి దేశంలోనే దిగ్గజ మార్కెట్లలో ఒకటిగా భారత్‌ను చేర్చారు. ఈ సోషల్‌ మీడియా దిగ్గజానికి అతిపెద్ద మొత్తంలో ఆడియన్స్‌ కలిగిన దేశంగా భారత్‌ ఉంది. 240 మిలియన్‌ మార్కును ఫేస్‌బుక్‌ అధిగమించింది. జూలై 13న భారత్‌లో తమకు 241 మిలియన్ల యాక్టివ్‌ యూజర్లున్నట్టు ఫేస్‌బుక్‌ రిపోర్టు చేసింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top