ఇక పుత్తడి ఆప్షన్స్‌ ట్రేడింగ్‌ | Centre taking steps to formalise gold trade, says Arun Jaitley | Sakshi
Sakshi News home page

ఇక పుత్తడి ఆప్షన్స్‌ ట్రేడింగ్‌

Oct 18 2017 1:02 AM | Updated on Aug 20 2018 5:20 PM

Centre taking steps to formalise gold trade, says Arun Jaitley - Sakshi

న్యూఢిల్లీ: మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌(ఎంసీఎక్స్‌)లో బంగారం ఆప్షన్స్‌ ట్రేడింగ్‌ను ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మంగళవారం(ధన త్రయోదశి రోజు) ప్రారంభించారు. బంగారం ట్రేడింగ్‌ను మరింత పారదర్శకంగా నిర్వహించడానికి తీసుకుంటున్న చర్యల్లో ఇదొకటని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

పుత్తడిపై భారతీయులకు మక్కువ ఎక్కువని, కొత్తగా అందుబాటులోకి వచ్చిన గోల్డ్‌ ఆప్షన్స్‌ ట్రేడింగ్‌ మంచి విజయం సాధించగలదని పేర్కొన్నారు. కమోడిటీ ఎక్సే్చంజ్‌లు ప్రారంభమైన 14 ఏళ్ల తర్వాత ఒక కమోడిటీలో ఆప్షన్స్‌ ట్రేడింగ్‌కు సెబీ ఆమోదం తెలపడం ఇదే తొలిసారని వివరించారు.

  గోల్డ్‌ ఆప్షన్స్‌లో కేజీ గోల్డ్‌ ఆప్షన్స్‌ను ఎంసీఎక్స్‌ ఆఫర్‌ చేస్తోంది. ఇవి నవంబర్, వచ్చే ఏడాది జనవరిలో ఎక్స్‌పైర్‌ అవుతాయి. తక్కువ వ్యయానికే గోల్డ్‌ ఆప్షన్స్‌ను ఆఫర్‌ చేస్తున్నామని, డిసెంబర్‌ వరకూ ఎలాంటి లావాదేవీల ఫీజును వసూలు చేయబోమని ఎంసీఎక్స్‌ ఎండీ, సీఈఓ మృగాంక్‌  పరాంజపే పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement