
ఐటీ కంపెనీలకు భారీ షాక్
భారత ఐటీ కంపెనీలను నిరోధించడానికి ఉద్దేశించిన '2016 హెచ్-1బీ, ఎల్ 1 వీసా సంస్కరణ చట్టం' బిల్లును సంయుక్త చట్టసభ సభ్యుల ద్వైపాక్షిక సమూహం ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టింది.
వాషింగ్టన్: హెచ్ 1 బీ,ఎల్ 1 వీసాలపై అత్యధిక ఆదాయన్ని పొందుతున్న భారతీయ ఐటీ కంపెనీలు, దేశ ఐటి నిపుణుల గుండెల్లో గుబులు మొదలైంది. భారత ఐటీ కంపెనీలను నిరోధించడానికి ఉద్దేశించిన '2016 హెచ్-1బీ, ఎల్ 1 వీసా సంస్కరణ చట్టం' బిల్లును సంయుక్త చట్టసభ సభ్యుల ద్వైపాక్షిక సమూహం ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టింది. ఈ వీసాలను నియంత్రించే యాంటి వీసా బిల్లును అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమోదముద్ర పడాలంటే ఈ బిల్లును సెనెట్ ఆమోదించాల్సి ఉంది.
ఈ నేపథ్యంలోనే అధికార, విపక్ష సభ్యులు హెచ్ 1 బీ, ఎల్ 1 సంస్కరణల బిల్లును సంయుక్తంగా ప్రవేశపెట్టారు. కాలిఫోర్నియా, న్యూ జెర్సీ రాష్ట్రాలకు చెందిన డెమొక్రాటిక్ పార్టీ నుంచి బిల్ పాస్ర్కెల్, రిపబ్లికన్ సభ్యుడు డానా రోహ్రా బాచెర్ ఈ బిల్లును ప్రతిపాదించారు. అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య పెరగడానికి కారణమవుతున్న హెచ్-1బీ, ఎల్ 1 వీసాల విధానాన్ని కఠినతరం చేయాలంటూ యూఎస్ కాంగ్రెస్ లోఈ బిల్లును ప్రవేశపెట్టారు. విదేశీ అవుట్సోర్సింగ్ కంపెనీల ఉద్యోగులే టాప్ వినియోగదారులుగా ఉన్నారని కాంగ్రెస్ కార్యాలయం విడుదల చేసిన ఒక మీడియా ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది.
వీసా జారీ ప్రక్రియలోని లోపాలను సవరించాలని సెనేట్ సభ్యులు డిమాండ్ చేశారు. తద్వారా అమెరికా ఉన్నోతోద్యోగులకు, వీసా హోల్డర్ల హక్కులను కాపాడాలని కోరుతున్నారు. విదేశీ ఉద్యోగులను ఎన్నుకునేటపుడు మరింత పారదర్శకంగా వ్యవహారించాలన్నారు. తద్వారా దుర్వినియెగాన్ని అడ్డుకోవాలని, వీసా నిబంధలను ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అమెరికాలో పనిచేస్తున్న భారతీయ సాంకేతిక నిపుణులపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. తక్కువ వేతనాలకే పనిచేయడానికి ఇతర దేశాల నుంచి వస్తున్నవారితో అమెరికా పౌరులు ఉద్యోగాలు కోల్పోతున్నారని వీరు ఆరోపించారు. ఈ కొత్త బిల్లు ప్రకారం- ఏదైనా కంపెనీ తమ ఉద్యోగుల్లో 50 కంటే ఎక్కువ మందిని, లేదంటే మొత్తం ఉద్యోగుల్లో సగం కంటే ఎక్కువ మందిని హెచ్-1బి, లేదా ఎల్-1 వీసాదారులతో భర్తీ చేసుకోవడం కుదరదు. పెద్దఎత్తున విదేశీ కార్మికుల్ని అమెరికాకు దిగుమతి చేసుకుని, స్వల్పకాలిక శిక్షణను ఇచ్చి, ఆ తర్వాత వారిని స్వదేశాలకు పంపించి అక్కడి నుంచే పనిచేసేలా చూసే కంపెనీలపై కొత్త నిబంధనలు కొరడా ఝళిపించనున్నాయి. అత్యంత ప్రాచుర్యం పొందిన హెచ్-1బి వీసా కార్యక్రమంలో సంస్కరణలు తీసుకువచ్చి, వేతన పరిమితుల్ని సవరించడానికి ఉద్దేశించిన బిల్లును అమెరికా 2010లో మొదటిసారి అమెరికా వీరువురు సెనేట్‌లో ప్రవేశపెట్టారు. కానీ అపుడు ఆమోదం లభించలేదు.