ఆనంద్‌ సార్‌.. నాకొక కారు గిఫ్ట్‌ ఇస్తారా!? | Anand Mahindra Witty Reply Makes Smile About An SUV | Sakshi
Sakshi News home page

వైరలవుతోన్న ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌

Aug 17 2019 4:38 PM | Updated on Aug 17 2019 4:48 PM

Anand Mahindra Witty Reply Makes Smile About An SUV - Sakshi

ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ఆసక్తికర అంశాలు, సంఘటనల గురించి ట్వీట్‌​ చేస్తూంటారు కాబట్టి అభిమానులు కూడా ఎక్కువే. తాజాగా తనకు కారు బహుమతిగా ఇవ్వాలంటూ ఓ అభిమాని చేసిన ట్వీట్‌కు ఆనంద్‌ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం తెగ ట్రెండ్‌ అవుతోంది. ఈ ట్వీట్‌లో ఆనంద్‌ అరుదుగా వాడే ఓ ఆంగ్ల పదాన్ని పరిచయం చేశారు. దాని అర్థాన్ని కూడా వివరించారు. విపుల్‌ అనే ఓ వ్యక్తి ఆనంద్‌ మహీంద్రాను ఉద్దేశిస్తూ.. ‘సర్‌.. నేను మీకు పెద్ద అభిమానిని. నా పుట్టినరోజుకు మహీంద్రా థార్ కారును బహుమతిగా ఇవ్వాగలరా’ అంటూ ట్విట్‌ చేశాడు.

ఇందుకు ఆనంద్‌ మహీంద్రా బదులిస్తూ..‘CHUTZPAH’ పదాన్ని పోస్ట్‌ చేశారు. ఈ పదానికి అతివిశ్వాసం, నిర్భయత్వం అనే అర్థాలు వస్తాయన్నారు. ‘విపుల్‌ని ప్రశంసించినా సరే లేదా విమర్శించినా సరే.. అతని (CHUTZPAH) అతివిశ్వాసం, నిర్భయత్వాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే. విపుల్‌ నీ CHUTZPAHకి ఫుల్‌ మార్క్స్‌. కానీ బాధకరమైన విషయం ఏంటంటే నీ కోరికను మన్నించలేను. అలా చేస్తే నా వ్యాపారం దెబ్బతింటుంది’ అంటూ సరదాగా బదులిచ్చారు.  ప్రస్తుతం వీరిద్దరి ట్విటర్‌ సంభాషణ తెగ ట్రెండ్‌ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement