ఆనంద్‌ మహీంద్ర ‘చెప్పు’ తో కొట్టారు..అదరహో |  Photo Shared by Anand Mahindra Goes Viral on Social Media | Sakshi
Sakshi News home page

ఆనంద్‌ మహీంద్ర ‘చెప్పు’ తో కొట్టారు..అదరహో

Apr 18 2019 3:00 PM | Updated on Apr 18 2019 3:02 PM

 Photo Shared by Anand Mahindra Goes Viral on Social Media - Sakshi

సాక్షి, ముంబై:  సెల్‌ఫోన్‌ వాడకం..రేడియేషన్‌ ప్రభావం,  క్యాన్సర్‌​ లాంటి వివిధ ప్రాణాంతక రోగాలు.. ఇలా ఎన్నిచెప్పినా  మనం సెల్‌ ఫోన్‌కు  మరింతగా బానిసలవుతూనే ఉన్నాం.   యావత్‌ ప్రపంచానికి కనిపించని శత్రవుగా పరిణమించిన  స్మార్ట్‌ఫోన్ల వాడకంపై కనీసం మనల్ని మనం నియంత్రించుకునే ప్రయత్నం ఎంతమంది చేస్తున్నాం అనేది  సందేహాస్పదమే. ఈ నేపథ్యంలోనే  పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర మరో అద్భుతమైన  సందేశాన్ని ట్విటర్‌లో పోస్ట్‌  చేశారు.

ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉండే మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వాట్సప్‌ వండర్‌బాక్స్ హాష్‌టాగ్‌తో షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెల్‌ఫోన్‌కు ఏ కవర్ ఉంటే బాగుంటుంది అనే దానిపై షేర్ చేసిన పోస్ట్  అన్నమాట.  చెప్పులను పోలి ఉన్న కవర్లు అయితే సెల్‌ఫోన్లకు కరెక్ట్‌గా సెట్ అవుతాయంటూ వ్యంగ్యంగా ఉన్న ఫోటోలను ఆయన ట్వీట్‌ చేశారు. స్మార్ట్‌ఫోన్‌కు ఎక్కువ సేపు ఉపయోగిస్తే మనకు మనం ఆ చెప్పులతో కొట్టుకున్నట్టేనట.  అన్నట్టు  ఈ ఫోటోను జనవరిలో పోస్ట్ చేసినప్పటికీ.. మళ్లీ ఇపుడు చక్కర్లు కొడుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement