వారఫలాలు 24-11-19 నుంచి 30-11-19 వరకు

Weekly Horoscope in Telugu 24-11-2019 - Sakshi

మేషం.. కుటుంబసమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పాత సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు ఊహించని విధంగా  పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు  ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

వృషభం...
సంఘంలో మీపై మరింత గౌరవం పెరుగుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు. కొత్త కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. పట్టుదలతో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వస్తు, వస్త్రలాభాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు లభిస్తాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో బంధువులతో విభేదాలు. స్వల్ప అనారోగ్యం. గులాబీ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

మిథునం...
ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు. అనుకున్న సమయానికి డబ్బు సమకూరుతుంది. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. చిన్ననాటి మిత్రులతో ముఖ్య విషయాలపై సంభాషిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. వ్యాపారాలు ఆశాజనకంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి కళారంగం వారికి విదేశీ పర్యటన లు. వారం ప్రారంభంలో ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కర్కాటకం...
ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి  మరింత మెరుగ్గా ఉంటుంది. బంధువులతో  కష్టసుఖాలు పంచుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. పారిశ్రామికవర్గాల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు.  పసుపు,ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది. 

సింహం....
చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి.  శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన బాకీలు అంది అవసరాలు తీరతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు పరిష్కారం. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. కళారంగం వారికి  అనుకోని అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో మిత్రుల నుంచి ఒత్తిడులు. అనారోగ్య సూచనలు. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గులాబీ, నేరేడు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

కన్య....
పనులు కొంత మందగిస్తాయి. బంధుమిత్రులతో  అకారణంగా విభేదాలు. ఆస్తి విషయాలలో సోదరుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. వ్యాపారాలలో సామాన్య లాభాలు. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా వేస్తారు. వారం మధ్యలో శుభవార్తలు వింటారు. నూతన ఉద్యోగప్రాప్తి. సన్మానాలు. గులాబీ, లేత నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.

తుల..
కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వ్యాపారాలలో లక్ష్యాల మేరకు లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కవచ్చు.రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. బంధువులతో తగాదాలు. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

వృశ్చికం..
కొత్త వ్యక్తులు పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. ముఖ్యమైన పనులు చకచకా పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగయత్నాలలో ముందడుగు వేస్తారు.  వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతాయి. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఎరుపు, తెలుపు రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు...
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఊహించని రీతిలో మెరుగుపడుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుపుతారు. సోదరులు, మిత్రులతో విభేదాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. కొత్త  కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుఉతాయి. పారిశ్రామికవర్గాలకు ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వారం చివరిలో ఆరోగ్యభంగం. సోదరులో వివాదాలు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనా పారాయణ చేయండి..

మకరం..
శ్రమకు ఫలితం దక్కుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి ఉంటుంది. సోదరులతో వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. భూములు, గృహం కొనుగోలు చేస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. ఉద్యోగాలలో అనుకూలస్థితి. రాజకీయవర్గాలకు ఊహించని విధంగా పదవులు లభిస్తాయి. వారం చివరిలో అనారోగ్యం. ధనవ్యయం. సోదరులతో మాటపట్టింపులు. నీలం, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

కుంభం..
మీరు చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. సన్నిహితుల  నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. పట్టుదలతో కొన్ని సమస్యలు  పరిష్కరించుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి.  కుటుంబసభ్యులు మీపట్ల మరింత విధేయత, అభిమానం చూపుతారు. వాహనాలు, భూములు కొంటారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. నలుపు, లేత నీలం రంగులు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి..

మీనం....
ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు చిన్ననాటి విషయాలు కొన్ని గుర్తుకు వస్తాయి. వేడుకలలో పాల్గొంటారు. కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. కోర్టు వ్యవహారం ఒకటి సానుకూలమవుతుంది. వాహనాలు, భూములు కొంటారు. వ్యతిరేక పరిస్థితుల  అనుకూలంగా మార్చుకుంటారు. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగుఉతాయి విద్యార్థుల యత్నాలు మరింత అనుకూలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో గందగోళ పరిస్థితుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు ఊహించని అవకాశాలు. ఎరుపు, నేరేడురంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top