‘ఆంధ్రజ్యోతి’ రాతలపై మండిపడ్డ ఎమ్మెల్యేలు | YSRCP MLAs fired on Andhrajyothy news | Sakshi
Sakshi News home page

‘ఆంధ్రజ్యోతి’ రాతలపై మండిపడ్డ ఎమ్మెల్యేలు

Jul 5 2017 7:11 PM | Updated on Aug 18 2018 4:06 PM

‘ఆంధ్రజ్యోతి’ రాతలపై మండిపడ్డ ఎమ్మెల్యేలు - Sakshi

‘ఆంధ్రజ్యోతి’ రాతలపై మండిపడ్డ ఎమ్మెల్యేలు

‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక రాతలపై వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మండిపడ్డారు.

తిరుమల: ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక రాతలపై వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అవాస్తవాలు రాసి గిరిజనులు, దళితుల మనోభావాలను కించపరచొద్దని హితవు పలికారు.

విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... గిరిజనులు మనోభావాలు దెబ్బతీసేలా ‘ఆంధ్రజ్యోతి’లో తప్పుడు వార్తలు రాశారని తెలిపారు. మీ రాతలు వెనక్కు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. నిన్న హైదరాబాద్‌కు వచ్చిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వైఎస్‌ జగన్‌ తమను పరిచయం చేసి, ఫొటోలు తీయించారని.. కానీ ఆంధ్రజ్యోతి విలువలు దిగజార్చేలా వార్త రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దళితుల మనోభావాలను దెబ్బతీసేలా ‘ఆంధ్రజ్యోతి’ లో వచ్చిన కథనాలను చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ ఖండించారు. ‘ఆంధ్రజ్యోతి’ తీరు మార్చుకోకుంటే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement