విశాఖలో అర్ధరాత్రి అరెస్టుల పర్వం | YSRCP Leaders Arrest in Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో అర్ధరాత్రి అరెస్టుల పర్వం

Jan 26 2017 9:15 AM | Updated on Mar 23 2019 9:10 PM

విశాఖలో అర్ధరాత్రి అరెస్టుల పర్వం - Sakshi

విశాఖలో అర్ధరాత్రి అరెస్టుల పర్వం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలే లక్ష్యంగా పోలీసులు అర్ధరాత్రి అరెస్టుల పర్వానికి తెరతీశారు.

వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్ల వద్ద భారీగా పోలీసుల మోహరింపు

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలే లక్ష్యంగా పోలీసులు అర్ధరాత్రి అరెస్టుల పర్వానికి తెరతీశారు. విశాఖపట్నంలో వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్ల వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. రాత్రి 11.30 సమయంలో 7వ వార్డు మాజీ కార్పొరేటర్, పార్టీ నేత పి.విజయచందర్‌ను అదుపులోకి తీసుకుని త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

మరికొందరు నేతలను అరెస్టు చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విశాఖ ఆర్‌కే బీచ్‌లో గురువారం జరగనున్న కొవ్వొత్తుల ప్రదర్శనలో స్వయంగా పాల్గొంటానని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement