
ఇద్దరు సీఎంలూ మాట్లాడుకోవాలి: అంబటి
రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు భేషజాలకు పోయి, అహంకారంతో ప్రజల సమస్యలను జటిలం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.
హైదరాబాద్: రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు భేషజాలకు పోయి, అహంకారంతో ప్రజల సమస్యలను జటిలం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. విభజన అనంతరం సీమాంధ్రకు చెందిన సమస్యల పరిష్కారానికి ఇద్దరు సీఎంలు ఏమాత్రం ప్రయత్నించడం లేదని, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా ముందు రావడం లేదని విమర్శించారు.
ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌ను ఆగస్టు 31 లోపుగా జరపాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల తాము హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు.