చంద్రబాబు తక్షణమే రాజీనామా చేయాలి: జోగి రమేష్ | YSR congress party mla Jogi ramesh demands on chandrababu resing on mla seat | Sakshi
Sakshi News home page

చంద్రబాబు తక్షణమే రాజీనామా చేయాలి: జోగి రమేష్

Aug 11 2013 1:37 PM | Updated on Aug 10 2018 7:19 PM

చంద్రబాబు తక్షణమే రాజీనామా చేయాలి: జోగి రమేష్ - Sakshi

చంద్రబాబు తక్షణమే రాజీనామా చేయాలి: జోగి రమేష్

సీమాంధ్ర ప్రాంత టీడీపీ నేతలు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటే తక్షణమే చంద్రబాబుతో రాజీనామా చేయించాలని వైఎస్ఆర్ సీపీ నేత జోగి రమేష్ ఆ పార్టీ నేతలను డిమాండ్ చేశారు.

సీమాంధ్ర ప్రాంత టీడీపీ నేతలు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటే తక్షణమే చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్ ఆ పార్టీ నేతలను ఆదివారం విజయవాడలో డిమాండ్ చేశారు. ఆ తర్వాతే సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని సీమాంధ్ర టీడీపీ నేతలకు ఆయన సూచించారు. చంద్రబాబు సమైక్యాంధ్రకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్న తర్వాతే సీమాంధ్ర ప్రాంతంలో అడుగుపెట్టాలని జోగి రమేష్ సూచించారు.

 

అప్పటి వరకు సీమాంధ్ర ప్రాంతంలో అడుగుపెట్టే అర్హత చంద్రబాబుకు లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పర్వవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని జోగి రమేష్ తెలిపారు. దిగ్విజయ్ వ్యాఖ్యలను రమేష్ ఈ సందర్భంగా ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement