ఆ లెటర్‌తో మాకు సంబంధం లేదు

YS Vivekananda Reddy Driver Wife Comments - Sakshi

వైఎస్‌ వివేకా డ్రైవర్‌ ప్రసాద్‌ భార్య కృప

సాక్షి, పులివెందుల రూరల్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగిన ప్రదేశంలో దొరికిన లెటర్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కారు డ్రైవర్‌ ప్రసాద్‌ భార్య కృప చెప్పారు. శనివారం వివేకా నివాసం వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. వివేకానందరెడ్డి తమ కుటుంబానికి ఎంతో సహాయం చేశారన్నారు. అలాంటి వ్యక్తిపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

గురువారం రాత్రి 11.45 గంటలకు తన భర్త ఇంటికొచ్చారని చెప్పారు. శుక్రవారం ఉదయం వైఎస్‌ వివేకానందరెడ్డి అల్లుడు ఫోన్‌ చేసి సార్‌కు బాగాలేదు.. ఇంటి దగ్గరకు వెళ్లాలని  చెప్పడంతో వెంటనే వెళ్లాడని ఆమె తెలిపారు. అంతేతప్ప.. లెటర్‌కు, తన భర్తకు ఎలాంటి సంబంధం లేదన్నారు. 

సంబంధిత కథనాలు

జగన్‌ చిన్నాన్న దారుణ హత్య...

సీబీఐ విచారణ జరిపించాల్సిందే

హత్య చేస్తుంటే ఎవరైనా లెటర్‌ రాస్తారా?

సీఐ వచ్చే వరకు రక్తం తుడవలేదు 

సుధాకర్‌రెడ్డిని నేనే బయటకు తీసుకొచ్చా: సతీష్‌ రెడ్డి

నేరస్తులకు సర్కారు దన్ను

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top