
జనసునామీ మధ్య జననేత జగన్ పాదయాత్ర
సాక్షి, విశాఖపట్నం: ‘మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో విశాఖ టాప్‌గేర్‌లో పరుగులు తీస్తే.. నేడు చంద్రబాబు హయాంలో అన్ని రంగాల్లోనూ రివర్స్ గేర్‌లో పోతోంది. ఆయన అడుగు పెడితే చాలు ఏదైనా ధ్వంసమే. ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది వైఎస్ హయాంలోనే. నాలుగున్నరేళ్లలో మచ్చుకైనా అభివృద్ధి కనిపించలేదు. ఎక్కడ భూమి కనిపించినా వదలకుండా దోచేశారని ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖలో వైఎస్ హయాంలో అభివృద్ధికి బాటలు వేస్తే..చంద్రబాబు హయాంలో అందినంత దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆదివారం విశాఖ కంచరపాలెం మెట్టు వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన తనదైన రీతిలో ప్రసంగిం చారు.
బీఆర్‌టీసీఎస్‌లను పూర్తి చేయని సర్కారు
విశాఖలో ఐటీ సెజ్, విశాఖ, దువ్వాడలో ఐటీ కారిడార్, పరవాడలో ఫార్మాసిటీ, అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్, బ్రాండెక్స్ నుంచి మొదలై ఎస్‌ఈజెడ్‌లలో వచ్చిన పరిశ్రమల వరకు ఎక్కడ చూసినా వేల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయని ప్రజలే చెబుతా ఉంటే ఆనందమేసింది. వైఎస్ హయాం లో 15 చోట్ల 15 కాలనీలు, ఏకంగా 35 వేల ఇళ్లు కట్టించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ తీసుకొచ్చారు. రూ.1500 కోట్లతో అభివృద్ధి చేపట్టారు. రాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ కోసం రూ.456 కోట్లతో కంచరపాలెం నుంచి పెందుర్తి, ఆరిలోవ నుంచి సింహాచలం మధ్య రెండు బీఆర్‌టీసీఎస్ రోడ్లు తీసుకొచ్చారన్నా.. వీటిలో 1.3 కిలోమీటర్ల మేర మిగిలి ఉన్న పనులను ఈరోజుకి పూర్తి చేయలేని అధ్వాన స్థితిలో పాలన సాగిస్తా ఉందని జననేత విమర్శించారు.
బాబు వల్లే ఉక్కుకు నష్టం
బీఐఎఫ్‌ఆర్‌కు పోయే పరిస్థితిలో ఉన్న విశాఖ ఉక్కును కేంద్రంతో పోరాడి మళ్లీ నిలబెట్టారన్నా. రూ.12 వేల కోట్ల విçస్తరణకు అడుగులు వేయిం చడం వల్లే నేడు రెట్టింపు కెపాసిటీతో నడుస్తూ ఉందంటే దానికి కారణం వైఎస్ చలవేనని చెబుతా అన్నారని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. కానీ ఏడు విశాఖ ఉక్కు పరిస్థితి ఎలా ఉందంటే..బాబు అడుగు పెట్టాడు..మళ్లీ నాలుగేళ్లుగా నష్టాలే నష్టాలు. నాన్నగారి హయాంలో మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ నుంచి ముంపునీరు పోయేందుకు కాల్వ తీసుకొచ్చి ఎయిర్‌పోర్టును ముంపునకు గురికాకుండా కాపాడారని, వంద కోట్ల అంతర్జాతీయ స్థాయిలో టెర్మినల్ నిర్మించారని జగన్ గుర్తు చేశారు.
అంతా ‘లూలూచీ’
ఉన్న హోటళ్లు చాలవన్నట్టు ఇంకొక ఫైవ్ స్టార్ హొటల్ కోసం లూలూ సంస్థకు ఏకంగా రూ.1200 కోట్ల విలువైన 12 ఎకరాల భూములను అప్పనంగా కట్టబెట్టారని జగన్ మండిపడ్డారు. లూలూ సంస్థ కోసం పక్కనే ఓ ప్రైవేటు సంస్థ నుంచి మూడున్నర ఎకరాలను బలవంతంగా లాక్కొని, వాటికి ప్రత్యామ్నా యంగా వందల కోట్ల భూములను దోచిపెట్టారని ధ్వజమెత్తారు. విశాఖలో భాగస్వామ్య సదస్సుల పేరిట మూడురోజుల మీటింగ్‌లు పెట్టి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలొచ్చాయని చెబుతా ఉన్నాడు.. మీకేమైనా కనిపించాయా అని ప్రజల్ని ప్రశ్నించారు. ఈ మూడురోజుల ముచ్చట కోసం రూ.150 కోట్లు ఖర్చు చేసిన బాబు సర్కార్ కేవలం తిండి కోసమే రూ.53 కోట్లు ఖర్చు చేశాడంటే ప్రజాధనాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నాడో వేరే చెప్పనక్కర్లేదని విమర్శించారు. డిపార్టుమెంట్ ఆఫ్ ఇండస్ట్రీ పాలసీ అండ్ ప్రమోషన్ ప్రకటించిన పెట్టుబడులను పరిశీలిస్తే ఏపీకి వచ్చినవి గత నాలుగేళ్లలో సగటున ఏడాదికి ఐదువేల కోట్లు మించలేదని గుర్తు చేశారు.
తిరోగమనంలో ఐటీ రంగం
ఇక ఐటీ రంగాన్ని పరిశీలిస్తే..ఆ దివంగత నేత నాన్నగారి హయాంలో 18వేల మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా.. రూ.2వేల కోట్ల ఐటీ ఎగుమతులుంటే. నేడు పెరగక పోగా ఉద్యోగాలు 16వేలకు, ఎగుమతులు రూ.1145కోట్లకు పడిపోయాయని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ పోర్టులో ఉన్న 24 బెర్త్‌ల్లో 12 బెర్త్‌లు ప్రైవేటు పరం చేశారని, ఒకప్పుడు 24వేల మంది పనిచేసేవారని, కానీ నేడు 4వేల మందికి మించి పనిచేయడం లేదన్నారు. కార్గో హ్యాండలింగ్‌లో వైఎస్ హయాంలో దేశంలోనే టాప్ వన్‌లో ఉన్న ఈ పోర్టు నేడు ఐదో స్థానానికి పడిపోయిందన్నారు. పోర్టు స్కూల్ కూడా మూతపడిందని, శిథిలావస్థకు చెందిన సిబ్బంది క్వార్టర్స్ ఉన్న 20 ఎకరాల స్థలాన్ని కూడా ఎలా కాజేయాలని చంద్రబాబు స్కెచ్‌లు వేస్తున్నారని ఆరోపించారు.
నిమ్స్ తరహాలో విశాఖలో 100 ఎకరాల్లో 1150 పడకలు 6 బ్లాకులు, 21 సూపర్ స్పెషాలిటీ విభాగాలతో రూ.250కోట్లు ఖర్చు చేసి విమ్స్ ఏర్పాటు చేస్తే నేడు ఆ విమ్స్ పరిస్థితి ఎలా ఉందంటే ఆరు బ్లాకులను రెండింటికి, 21 సూపర్ స్పెషాలిటీ విభాగాలను ఎనిమిదికి కుదించారని, చివరకు వైద్యుల పోస్టులను నోటిఫై చేసి ఉద్యోగాల్లోకి తీసుకోకుండా డిప్యుటేషన్‌పై తీసుకున్న దిక్కుమాలిన ప్రభుత్వమని,పైగాఇదే విమ్స్‌ను ప్రైవేటుకీరణ చేసేందుకు జీవో 33ను తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రకు పెద్దదిక్కైన కేజీహెచ్‌లో పరిస్థితి ఎలా ఉందంటే 1200 బెడ్‌లుండే 2వేల మంది ఇన్‌పేషంట్లు జాయిన్ అవుతారు. మంచానికి ఇద్దరు పేషంట్లు ఉంటున్నారని, డాక్టర్లను,నర్సులను కూడా రిక్రూట్ చేయడం లేదన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజాసంకల్ప పాదయాత్రలో ఆదివారం ఆయన వెంట వైఎస్సార్‌సీపీ జాతీయకార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, పాదయాత్ర ప్రొగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, శాసనసభ పక్ష ఉపనాయకుడు బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి పి.విశ్వరూప్, మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, రాష్ట్ర నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, విశాఖ పార్లమెంట్ సమన్వయకర్త ఎం.వి.వి.సత్యనారాయణ, అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త వరుదు కల్యాణి, అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌రాజు, సమన్వయకర్తలు తిప్పల నాగిరెడ్డి, కె.కె.రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, కోలా గురువులు, అక్కరమాని విజయనిర్మల, అన్నంరెడ్డి అదీప్‌రాజు, ఎం.వి.రమణమూర్తిరాజు, శెట్టి ఫాల్గుణ, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకరగణేష్, వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు, మాజీ ఎమ్మెల్యేలు కుంభా రవిబాబు, సర్రాజు(ఉండి), రాష్ట్ర కార్యదర్శులు ప్రగడ నాగేశ్వరరావు, రొంగలి జగన్నాధం, కె.ఎల్.ఎమ్.మోహనరావు, తాడి విజయభాస్కరరెడ్డి, సిఇసి సభ్యుడు కాకర్లపూడి శ్రీకాంత్, పైల శ్రీనివాసరావు, రిటైర్డ్ విజిలెన్స్ ఎస్పీ యజ్జల ప్రేమ్‌బాబు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి, సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర యూత్ విభాగం అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్ యాదవ్, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గుడ్ల పోలిరెడ్డి, నగర అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ, రాష్ట్ర అదనపు కార్శదర్శులు పక్కి దివాకర్, రవిరెడ్డి, బైలపూడి భగవాన్ జైరామ్, నగర యూత్ అధ్యక్షుడు కొండా రాజీవ్‌గాంధీ, నగర విద్యార్ధి విభాగం అధ్యక్షుడు బి.కాంతారావు, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు బర్కత్ ఆలీ, డీసీసీబీ మాజీ ఉపాధ్యక్షుడు సుంకర గిరిబాబు, నగర మహిళ అధ్యక్షురాలు గరికిన గౌరి, పెన్మత్స శ్రీదేవి వర్మ, పసుపులేటి ఉషాకుమారి, ఈగలపాటి యువశ్రీ, గెడ్డం ఉమ, చొక్కాకుల వెంకటరావు, జాన్ వెస్లీ, విశాఖ పార్లమెంట్ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు రెయ్యి వెంకటరమణ, అరకు పార్లమెంట్ జిల్లా విద్యార్ధి విభాగం అధ్యక్షుడు తడబారిక సురేష్‌కుమార్, అనంతపురం నుంచి పసుపుల బాలకృష్ణారెడ్డి, వెన్నపూస రామచంద్రారెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, రాష్ట్ర నాయీబ్రాహ్మణ సేవాసంఘం అధ్యక్షుడు సిద్ధపటం యాదయ్య, యూత్ అధ్యక్షుడు ఎన్.నూకరాజు, రాష్ట్ర కార్యదర్శి రావులకొల్ల మల్లేశ్వరరావు, రాజంపేట నుంచి చొప్పా గంగిరెడ్డి, పొల శ్రీనివాసరెడ్డి, చొప్పా ఎల్లారెడ్డి, దుర్గారెడ్డి, నిర్మలా జైన్, ఇచ్ఛాపురం నుంచి అందాల విక్రమ్, గండేపల్లి బాబి, చిన్నేపల్లి మధుసూదనరావు, హైదరాబాద్ నుంచి రాజేష్, సత్యనారాయణరాజు, జీవీఎంసీ వార్డు అధ్యక్షులు సనపల చంద్రమౌళి, గుజ్జు వెంకటరెడ్డి, చల్లా ఈశ్వరరావు, బొడ్డేట నాగు, కంట్రెడ్డి రామన్న పాత్రుడు, జి.వి.రమణి, ముర్రు వాణి నానాజీ, బొడ్డు ఎరునాయుడు, దాడి నూకరాజు, ఆడారి శ్రీనివాసరావు, కటుమూరు సతీష్, సంగూరు రవీంధ్రరెడ్డి తదితరులు ఉన్నారు.
జగన్...ఓ నమ్మకం
గ్రామీణ జిల్లానుంచి మహిళా లోకం పెద్ద ఎత్తున తరలివచ్చింది..వారందరికీ రుణపడి ఉంటామని అనకాపల్లి పార్ల మెంట్‌నియోజకవర్గ సమన్వయకర్త వరుదు కల్యాణి అన్నారు. ఆమె విలేకర్లతో మాట్లాడుతూ అనకాపల్లి పార్ల మెంట్ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు. ప్రతి చోటా మహిళలు జగన్‌కు బ్రహ్మరథం పట్టారన్నారు. హారతులిచ్చి స్వాగతం పలికారని, నీ వెంట మేమున్నామంటూ ఆశీర్వదించారన్నారు. ఉక్కు సంకల్పంతో చేపట్టిన పాదయాత్ర చరిత్ర సృష్టిస్తోందన్నారు. తమ వద్దకు వచ్చిన జగన్‌కు స్వాగతం పలకడంతోపాటు నగరంలో జరిగిన బహిరంగ సభకు కూడా తరలి వెళ్లడం మహిళలకు జగన్‌పై ఉన్న నమ్మకాన్ని,అభిమానాన్ని మరోసారి రుజువు చేసిందన్నారు. గ్రామీణ జిల్లాలో పాదయాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.