వివేకానందరెడ్డి హత్యకేసుపై వైఎస్‌ జగన్‌ పిటిషన్‌

YS Jagan Files Petition On YS Vivekananda Reddy Murder Case In AP High Court - Sakshi

సాక్షి, అమరావతి : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు మంగళవారం ఆయన న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యను చిన్నదిగా చూపించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆయన ఈ హత్యను రాజకీయంగా వాడుకుంటున్నారని వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ విచారణ వల్ల వాస్తవాలు బయటకు వస్తాయనే నమ్మకం లేదు కాబట్టి స్వతం‍త్ర దర్యాప్తు సంస్థకు ఈ కేసును అప్పగించాలని ఆయన పేర్కొన్నారు.

ప్రతివాదులుగా ఎనిమిది మంది
వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో.. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, ఏపీ డీజీపీ, కేంద్ర ప్రభుత్వం, సీబీఐ తదితర ఎనిమిది మందిని పిటిషనర్‌ వైఎస్‌ జగన్‌ ప్రతివాదులుగా చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ పోలీసుల అజమాయిషీ లేని స్వచ్ఛంద దర్యాప్తు సంస్థచేత విచారణ జరిపించాలని న్యాయస్థానాన్ని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top